చిత్తూరు

వసతి కల్పన విభాగంలోనూ శ్రీవారి సేవకుల సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: తిరుమల కాటేజీల్లో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వసతి కల్పన విభాగంలోనూ ఇకపై శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని టీటీడీ తిరుమల జే ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో జేఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జేఈవో విలేఖర్లతో మాట్లాడుతూ తిరుమలలో మొదటగా అంజనాద్రినగర్ కాటేజీ ప్రాంతంలో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని, ఈ నెలాఖరు నాటికి ఇతర కాటేజీలను విస్తరిస్తామని తెలిపారు. కాటేజీల్లో అటెండర్ల సంఖ్యను నిర్దారించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి సేవకుల నుండి మరింత మెరుగైన సేవలను పొందేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. సంవత్సరంలో 100రద్దీ రోజులు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి వంటి 15ముఖ్యమైన రోజులు, 250 సాధారణ రోజులలో ఆయా విభాగాలకు అవసరమైన శ్రీవారి సేవకుల సంఖ్యను అధికారులు నిర్దారిస్తున్నారని చెప్పారు. ఆయా విభాగాలకు శ్రీవారి సేవకుల కేటాయింపునకు సంబంధించి ఒక కమిటీని రూపొందిస్తున్నామన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను, రుచిని మరింత పెంచేందుకు సీనియర్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. దిట్టం, లడ్డూ తయారీ విధానాన్ని అధికారులు అధ్యయనం చేస్తారన్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మార్చి రెండవ పక్షంలో ఫ్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్‌ఎ అండ్ సిఏవో బాలాజి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో అదనపు ప్రసాదం కౌంటర్ ఏర్పాటు
శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత వేగవంతంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్‌ను మంగళవారం టీటీడీ తిరుమల జేఈవో శ్రీనివాసరాజు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా అన్నప్రసాదాలు అందించాలని ఆలయ అధికారులకు సూచించారు. జేఈవో వెంట ఎఫ్‌ఎ అండ్ సిఏఓ బాలాజి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ 2 రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం సర్వదర్శన టైంస్లాట్ కౌంటర్ల పనుల పురోగతిపై టీటీడీ ఐటి, టిసిఎస్ అధికారులతో జేఈవో సమీక్షించారు.

మచ్చలేని వ్యక్తి ప్రధాని మోదీ
* రాష్ట్రానికి మేలు చేయాలన్న తపన మోదీలో కనిపిస్తోంది * మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం

తిరుపతి, ఫిబ్రవరి 20: మచ్చలేని మనిషి ప్రధాని నరేంద్రమోదీ అని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఆయనకే ఉందన్న విషయం ఇప్పటికే రుజువైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వైస్ చైర్మన్‌గా హాజరైన మంత్రి తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీ స్నేహ బంధంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ఎవరికి వారు ఊహాగానాలతో మాట్లాడటం సరికాదని, టీడీపీ మిత్రపక్షం కొనసాగింపుపై జరుగుతున్న ప్రచారంపై ఆయన వ్యాఖ్యానించారు. పొత్తుల విషయంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలన్న తపన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లో కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలను పవన్ కలుపుకుని వెళ్లడం సంతోషదాయకమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వేడుకగా ఏకాంత సేవ
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఏకాంత సేవ వేడుకగా జరిగింది. మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 9వ తేదీన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధ్వజారోహణం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు స్వామి, అమ్మవార్లకు కంకణాలను కట్టారు. అందువల్ల ఉత్సవాలు పూర్తయ్యేవరకు ఏకాంత సేవ జరపడానికి వీలులేదు. సోమవారంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. దీంతో ఆలయ అధికారులు ఏకాంత సేవ నిర్వహించారు. మంగళవారం రాత్రి సర్వదర్శనం పూర్తయిన తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రెండు పల్లకీల్లో ఆలయంలో ఊరేగించారు. అమ్మవారి సన్నిధిలోవున్న శయన మందిరంలో ఉత్సవ మూర్తులను అలంకరించి జోలపాట పాడారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ భ్రమరాంబ, సిబ్బంది, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

స్విమ్స్‌ని మరింత అభివృద్ధి చేస్తాం
* మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి
తిరుపతి, ఫిబ్రవరి 20: స్విమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం స్విమ్స్‌లో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం స్విమ్స్‌లో ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా రూ.6కోట్లతో ఏర్పాటు చేసిన సిములేన్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణాసియాలోనే 70 పడకల డయాలసిస్ యూనిట్ స్విమ్స్‌లోనే ఉందన్నారు. త్వరలో మరో 30 డయాలసిస్ యూనిట్‌లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పద్మావతి మహిళా వైద్య కళాశాల దేశంలోనే మూడవదని తెలిపారు. భారత రాష్టప్రతి ప్రశంసలు కూడా అందుకున్న వైద్య కళాశాల స్విమ్స్‌లో ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుచే ప్రారంభించిన ఈ హాస్పిటల్ నేడు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ, వివిధ విభాగాలతో వృద్ధి చెందుతోందన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి స్విమ్స్ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 25న ఆస్పత్రిలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలోవున్న అతి పెద్ద వైద్య సంస్థ స్విమ్స్ అని, దీనిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. స్విమ్స్ ఆర్థిక పరిస్థితిపై సైతం చర్చించడం జరిగిందని, నిధుల విషయంలోను నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆయన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష్యం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, భవిష్యత్తులో డాక్టర్లు కానున్న స్విమ్స్ వైద్య విద్యార్థులేనని చెప్పారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈసందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా స్విమ్స్ అంతర్జాతీయ అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌చే గుర్తింపు పొందిన సంస్థగా రూపొందిందన్నారు. ఈ సెంటర్ ద్వారా వైద్యులు, సిబ్బందికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఎమర్జెన్సీ కార్డియోవాస్కులర్ కేర్ కోర్సులు, ప్రొవైడర్ అండ్ ఇన్‌స్ట్రక్చర్ కోర్సు ఇన్ బేసిక్ లైఫ్ సపోర్టు, అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు కోర్సుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.