చిత్తూరు

ఉధృతమవుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 23: తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రం రూపం దాల్చుతోంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 వ తేది నుంచి జిల్లాలోని 2 వేల మందికి పైగా ఉన్న విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె బాట పట్టిన విషయం విదితమే. సమ్మె ప్రారంభించి మూడు రోజులు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో వేదనకు గురైన కార్మికులు తమ సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు. శుక్రవరాం అర్థనగ్న ప్రదర్శన చేశారు. స్థానిక గాంధీరోడ్డులోని విద్యుత్ కార్యాలయం నుంచి జిల్లా కోర్టు, రైల్వే స్టేషన్, జ్యోతిరావ్‌పూలే సర్కిల్, ఎన్‌టిఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు అర్థనగ్నంగానే భారీ నిర్వహించారు. గాంధీ సర్కిల్‌లోని జాతిపిత గాంధీకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమస్యలను పరిష్కరించేలా చంద్రబాబు సర్కార్ మనసు మార్చాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అక్కడ నుంచి ఎంఎస్‌ఆర్ సర్కిల్, పొన్నియమ్మ గుడి వీధి, డి ఐ రోడ్డు మీదుగా అర్థనగ్న ప్రదర్శన చేస్తూనే విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు హేమకుమార్, మనీష్‌కుమార్, ఐరాల శ్రీనివాసులు మాట్లాడుతూ తమ కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను విద్యుత్ సంస్థలో విలీనం చేయడం, సుప్రీంకోర్టు ఆదేశాలతోసమాన పనికి సమాన వేతనం మంజూరు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయడం, తెలంగాణా రాష్ట్రం తరహాలో కాంట్రాక్టు కార్మికులకు మూడవ పార్టీతో సంబంధం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించడం, సీనియారిటి ప్రాతిపదిన తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ 20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు, సంబందిత కార్మికుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంస్థలో ఉద్యోగం ఇవ్వడం వంటి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రోజుకో రీతిలో ప్రాణాలకు తెగించి ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నరేష్, రూప్‌కుమార్, నిరంజన్, చంద్ర, సాయితో పాటు 150 మందికి పైగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
* ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించాలి * పరీక్షా కేంద్రాల్లో వౌళిక వసతులు కల్పించాలి
* అధికారులను ఆదేశించిన జేసి -2 చంద్రవౌళి

చిత్తూరు, ఫిబ్రవరి 23: జిల్లాలో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జేసి- 2 చంద్రవౌళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులోని జిల్లా సచివాలయంలో ఇంటర్ పరీక్షలపై వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి-2 మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 132 కేంద్రాల్లో జరుగుతాయని, ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌తో పోటు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆర్ధగంట ముందే చేరుకొనే విధంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాల్లో నిరంతం విద్యుత్ ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో తాగు నీరు తదిర వౌళిక వసతులు కల్పించాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద విధిగా ఒక ఏఎన్‌ఎంతో పాటు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇన్విజిలేటర్లు నియామకం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ పరీక్షలు కాఫీంగ్ జరగకుండా నిత్యం స్క్వాడ్‌లను తరుచూ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్ నుంచి పశ్నా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే సమయంలో పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లాలని సూచించారు. ఈ పరీక్షలు జరుగు రోజుల్లో కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ , ఇంటర్ నెట్ సెంటర్లను స్థానిక తహశీల్దార్లు మూపించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత డివిజన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ అసిస్టెంట్ కమిషనర్ నిరంజన్ కుమార్, వైద్య శాఖ డిసి సుదర్శన్, విద్యుత్, ట్రాన్సోకో, ఆర్టీసీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.