చిత్తూరు

శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మెరుగైన సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 23: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాదిగా విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం టీటీడీ ఈఓ, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుతో కలిసి శ్రీవారిసేవపై 3 గంటలపాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాలలో శ్రీవారి సేవకుల ద్వారా మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగతంగా 3 రోజులు, 4 రోజుల శ్రీవారిసేవ స్లాట్ కొరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశం గురించి ఎస్వీబీసీ ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవిని ఆదేశించారు. విద్యావంతులు, యువత, ప్రవాస భారతీయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవకు రావాలన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, విజిలెన్స్, కల్యాణ కట్ట, వసతి, ఆరోగ్య విభాగం, ఇతర విభాగాలలో సాధారణ రోజులు, రద్దీ రోజులలో శ్రీవారి సేవకుల వినియోగాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈకార్యక్రమంలో టీటీడీ సీవీఎస్‌ఓ ఆకే రవికృష్ణ, డెప్యూటీ ఈఓలు హరీంద్రనాధ్, శ్రీ్ధర్, బాలాజి, నాగరత్న, ఆరోగ్యవిభాగం అధికారి డాక్టర్ శర్మిష్ట, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ ప్రముఖుల సౌకర్యాలపై తిరుమల జేఈఓ సమీక్ష
అంతకుముందు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం, వసతి తదితర అంశాలపై తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు శుక్రవారం తిరుపతి సబ్ కలెక్టర్ కుమారి కీర్తితో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఏఓ రవిప్రసాద్, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్, వసతి విభాగం డిప్యూటీ ఈఓ బాలాజీ, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణ యాదవ్, డిప్యూటీ ఈఓలు వరలక్ష్మి, దామోదరం, ఆర్‌డీటీ రూప్‌చంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.