చిత్తూరు

అధికారులకు ఎమ్మెల్యే అనే గౌరవం లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 25: అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయాలని ఎమ్మెల్యే ఆశిస్తుంటే అధికారులకు ఇసుమంత గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని టీటీడీ సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు ఆవేదన, ఆక్రోశాన్ని వ్యక్తపరిచారు. ఆదివారం ఎమ్మెల్యే స్వగృహంలో తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పోతుల సునీత అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రారంభమైన సమావేశం 3.15 గంటలకు ముగిసింది. నెలకోమారు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అందుతున్న విధానాలపైన సమీక్షిస్తారు. 26 మంది సభ్యులున్న ఈ కమిటీలో ఆదివారం నాటి సమావేశానికి సుమారు 10మంది వరకు గైర్హాజరైయ్యారు. అయితే సమావేశానికి హాజరైన వారంతా టీటీడీ, పోలీస్, నగరపాలక సంస్థ అధికారులు తమకు సహకరించలేదనే అంశంపై నిప్పులు చెరిగారు. తిరుమలలో దర్శనాలకు సంబంధించి లేఖలు పెట్టినా అధికారులు పట్టించుకోవడంలేదని ఒక నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో హాకర్ లైసెన్సులు ఉన్నా విజిలెన్స్ అధికారులు చిరువ్యాపారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని కొందరు నాయకులు ఆరోపించారు. ఇటీవల వారిని దొంగల్లా చూస్తూ వారిని చితకబాదిన సంఘటనలను ప్రస్తావించారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు నడుపుకోవడానికి ఎక్కడా ఒక ప్రదేశం చూపకుండా వారి కడుపు కొడుతున్నా టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తిరుపతిలోనూ తోపుడు బండ్ల వ్యాపారులను పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా అధికారుల్లో సానుకూల స్పందన చూపించకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొర్లగుంట డివైడర్‌కు సంబంధించి సమస్యపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి చెప్పినా ఎస్పీ, ఇతర అధికారులు పరిష్కరించక పోగా ఆందోళనకారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఈ పరిస్థితి కొనసాగితే ప్రజలకు ఎమ్మెల్యేపై నమ్మకం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వడంలేదని నిప్పులు చెరిగారు. చంద్రన్న బీమా పథకం కింద సాధారణ మరణాలకు రూ.30వేలు, ప్రమాద వశాత్తు చనిపోతే రూ.5లక్షలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే గాయపడినా, చనిపోయినా చంద్రన్న బీమా పథకం కింద వస్తున్న సొమ్మును అధికారులు ఎమ్మెల్యేకి తెలియకుండా బాధితులకు ఇచ్చి చేతులు ఊపుకుంటూ వస్తున్నారని వాపోయారు. దీంతో బాధితులు తమకు అందుతున్న నష్టపరిహారం అధికారులు ఇస్తున్నట్లుగా భావిస్తున్నారే తప్ప, ప్రభుత్వానికి గుర్తింపులేకుండా పోతోందన్నారు. అదే ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చి ఆమెను కూడా వెంట పెట్టుకుని వెడితే ప్రజలకు ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలను వివరించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి అంశం ఎమ్మెల్యే చేతుల మీదుగా నడిపేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా తమకు ఏమీ మేలు జరగడంలేదనే బాధతో కార్యకర్తలు ఉన్నారని కొంత మంది నాయకులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీలో ఎంతో మంది నిరుపేద కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు. అలాకాని పక్షంలో భవిష్యత్తు ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరూ పార్టీ వెంట నడిచే అవకాశం ఉండదన్నారు. కార్యకర్తలను విస్మరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నేతల అభిప్రాయాలు విన్న ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ ఈ విషయాన్ని తాను మంత్రి అమరనాథ రెడ్డి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తుడా చైర్మన్ నరసింహయాదవ్, డీసీసీబీ చైర్మన్ అమాసరాజశేఖర్ రెడ్డి, గంగమ్మగుడి చైర్మన్ ఆర్సీ మునికృష్ణ, రాష్ట్ర నాయకుడు నీలం బాలాజీ, సూరాసుధాకర్ రెడ్డి, కొండాహరిబాబు, గుణశేఖర్, లక్ష్మీపతి నాయుడు, బుల్లెట్ రమణ, డాక్టర్ ఆశాలత, ఎన్.విజయలక్ష్మి, మస్తాన్ నాయుడు, వై.ప్రవీణ్, జనతా గిరి, కూమారమ్మ, అంబూరు సింధూజ తదితరులు పాల్గొన్నారు.