చిత్తూరు

ధ్యానం మనిషి ప్రగతి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 25: ధ్యానం మనిషి ప్రగతికి సోపానమని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఉద్బోధించారు. తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యాన రజతోత్సవాలు ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ, ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మహా మహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్యలు జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ధ్యానం, యోగాతో మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. భారతీయ రుషులు అందించిన ఈ రెండు నేడు ప్రపంచానికి అత్యావశ్యకమయ్యాయన్నారు. దీనిని గుర్తించి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు సైతం ధ్యానం, యోగాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. బ్రహ్మర్షి పత్రీజీ మాట్లాడుతూ ధ్యానం ద్వారా అన్ని వయస్సుల వారు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తున్నారని చెప్పారు. ధ్యాన ప్రక్రియలో అనేక విధానాలున్నా శ్వాస మీద ధ్యాసకు ఒక ప్రత్యేక ఉందని పేర్కొన్నారు. తిరుపతిలో 25సంవత్సరాల క్రితం దీనిని ప్రారంభించినప్పుడు నలుగురైదుగురు మాత్రమే ఉండేవారన్నారు. నేడు ఈ సంఖ్య వందలు, వేలుగా మారిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని అనుసరించే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ ధ్యానం, యోగ విశిష్టతను వివరించారు. తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షులు కంచి రఘురామ్, చీఫ్ ప్యాట్రన్ భీమాస్ రఘు మాట్లాడుతూ తమ అనుభవాలను వివరించారు. అనంతరం విద్యాలయాలన్నీ వ్యక్తి వికాస కేంద్రాలే అనే అంశంపైన సదస్సు జరిగింది. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యానానుభవ సందేశాలను వివరించారు. ముగింపు కార్యక్రమంలో తుడా చైర్మన్ నరసింహయాదవ్, రాస్ ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ డాక్టర్ జి.మునిరత్నం, టీటీడీ శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేశవులు, సభ్యులు కె.బసవయ్య, ఎ.సంగీతబాబు, కంచి జయరామ్, వి.నాగయ్య, వి.సుమతి, కె.సరోజమ్మ, వి.క్రిష్ణకుమారి, ఎస్.సురేంద్రకుమార్, బి. ఆదిలక్ష్మి, డి.ప్రవీణ్‌కుమార్, ఎ.జయరామిరెడ్డి, శాంతివనజ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ బుకీలు 12 మంది అరెస్ట్
* రూ.1,07,000లు నగదు, 13సెల్‌ఫోన్లు స్వాధీనం
వాల్మీకిపురం, ఫిబ్రవరి 25: వాల్మీకిపురంలో శనివారం రాత్రి జరిగిన భారత్, సౌత్‌ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహించిన 12మందిని అరెస్ట్ చేసినట్లు మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. వివరాలిలా వున్నాయి. వాల్మీకిపురం టౌన్, తోటవీధికి చెందిన హరిప్రసాద్ శనివారం జరిగిన భారత్ సౌత్‌ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహించాడు. అతని ఇంటిలో మ్యాచ్ ప్రత్యేక్షప్రసారం చేస్తూ 11మంది ద్వారా బెట్టింగ్ నిర్వహించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వాల్మీకిపురం, గుర్రంకొండ ఎస్‌ఐలు బెట్టింగ్ స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 12మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13సెల్‌ఫోన్లు, ఒక టీవీ, రూ.లక్షా ఏడువేలు నగదును స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీస్పీ మాట్లాడుతూ మదనపల్లె డివిజన్ పరిధిలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ బెట్టింగ్‌లో ఇంకా కొంత మంది ఉన్నట్లు విచారణలో తెలిసిందని, వారిని కూడా పట్టుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం
*తిరుపతి సబ్‌కలెక్టర్ కీర్తి హామీ
ఏర్పేడు, ఫిబ్రవరి 25: మండలంలోని పాగాలి రెవెన్యూలో ఫ్యాక్టరీలు నిర్మించుకునేందుకు భూములు ఇచ్చిన రైతులందరికి త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని తిరుపతి సబ్‌కలెక్టర్ కీర్తి హామీ ఇచ్చారు. ఆదివారం ఆమె తహశీల్దార్ శేషగిరిరావు, ఆర్‌ఐ జానీబాషాతో కలసి పాగాలి గ్రామంలో భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రభుత్వ అధికారులు రెండేళ్లనాడు రైతుల నుంచి భూములు తీసుకున్నారు. అయితే ఇంత వరకు నష్టపరిహారం చెల్లించకనే ఫ్యాక్టరీల నిర్మాణ పనులు చేపట్టడంతో ఆందోళనకు గురైన రైతులు పనులు అడ్డుకుంటామని జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు సబ్‌కలెక్టర్ కీర్తి మండల రెవెన్యూ అధికారులతో కలసి హుటాహుటిన ఆదివారం రైతులతో సంప్రదించి వారి వివరాలను సేకరించారు. అదేవిధంగా కాఫీ ఫ్యాక్టరీ, అల్లాయిస్ వీల్స్ కంపెనీలకు భూములను ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాగాలి గ్రామ రైతులు పాల్గొన్నారు.