చిత్తూరు

పల్లకిపై మోహినీ అవతారంలో కోదండరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 20: శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి 10గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన పల్లకిపై మోహినీ అవతారంలో కదలివచ్చిన స్వామికి భక్తులు పెద్దసంఖ్యలో కర్పూర నీరాజనాలు సమర్పించుకుని తన్మయులయ్యారు. మోహినీ అవతారం భాగవంతంలో రమణీయంగా వర్ణించబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో దేవదానవులకు తలెత్తిన కలహాన్ని నివారించి అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీవారి మోహినీ అవతారంలో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీనులు కాకతప్పదని, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహనీ రూపంలో స్వామి వెల్లడించారని పండితులు తెలిపారు. వాహనసేవ అనంతరం ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.

గరుడ వాహన రూఢుడైన కోదండరాముడు
శ్రీ కోదండరాముని నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో గడరుడసే అత్యంత ముఖ్యమైంది. గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, వాసంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్య సూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరాముని తన భుజ స్కంధలాపై మోస్తూ నాలుగు మాడవీధుల్లో ఊరుగుతుంటే భక్తులు పరవశించిపోయారు. వాహనం ముందుభాగాన వేదపండితులు వేదమంత్రోచ్చారణలు చేస్తుండగా, కోలాటాలు, భజన బృందాలు నృత్యం చేస్తుండగా స్వామివారి వాహనసేవ నయనానందకరంగా సాగింది.

శ్రీరామచంద్రమూర్తి పాదాల ఊరేగింపు
స్థానిక కోదండరాముని గరుడవాహన సేవలో స్వామికి అలంకరించునున్న శ్రీరామచంద్రమూర్తి పాదాలను ఉదయం చతుర్మాడా వీధుల్లో ఊరేగించారు. స్వామివారి స్వర్ణపాదాలకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ పెద్ద జీయర్, చిన్నజీయర్, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్ మునికృష్ణారెడ్డి, ఎవీఎస్వో గంగరాజు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషారెడ్డి, మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

కోదండరామునికి శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు
తిరుపతి, మార్చి 20: టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలను బహుమానంగా అందించడంలో భాగంగా మంగళవారం స్థానిక శ్రీకోదండ రాయాలయానికి రత్నాలతో చెక్కిన జడబిల్ల, శ్రీరాముల వారి బంగారు కుడి హస్తం, శ్రీరాములవారి బంగారు ఎడమ హస్తం, రెండు శీమకమలములు పొదిగిన బంగారు పాద కవచాలు ఉన్నాయి. వీటిని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, బొక్కసం బాధ్యులు గురురాజారావు, ఎవీఎస్వో కూర్మారావులు ఆలయం వద్దవున్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీకి అప్పగించారు. ఈ ఆభరణాలను గరుడవాహన సేవలో స్వామివారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ మునికృష్ణారెడ్డి, ఎవీఎస్వో గంగరాజు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శేషారెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏసియా లెవెల్ పోటీల్లో మిట్స్ విద్యార్థుల ప్రతిభ
మదనపల్లె, మార్చి 20: అంగళ్ళు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్, ఇసిఇ, ఇఇఇ విభాగంలో చదువుతున్న విద్యార్థులు స్పోర్ట్స్‌కారును తయారుచేసి ఆసియాలెవెల్‌లో జరిగిన హైబ్రీడ్ వెహికల్ చాలెంజ్, హెచ్.వి.సి పోటీల్లో టాప్-22 స్థానంలో నిలిచి ప్రతిభ కనబరచారని మిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ యువరాజ్ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈపోటీలలో మిట్స్ విద్యార్థులు తయారుచేసిన వెహికల్‌ను నడిపి ప్రతిన కనబరచినట్లు వెల్లడించారు. వాహనతయారీకి రూ.4లక్షలు ఖర్చు అయిందన్నారు. మెకానికల్ థర్డ్‌ఇయర్ చదువుతున్న శివనాగరాజ, లోకేష్, అబుబకల్, నాగేంధ్ర, శ్రీ్ధర్‌బాబు, మోహిత్, వి.సురేంద్ర, సురేష్, యువశ్రీ, విజయనరసింహా, నరసింహులు, దినేష్, ప్రసాద్, సుహేల్, శివమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, జగదీష్, ఇసిఇ చదువుతున్న విజయలక్ష్మీ, సౌమ్యశ్రీ, లక్ష్మీతేజ, ఇఇఇ చదువుతున్న సుధీర్‌రెడ్డిలు సంయుక్తంగా అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఈ వాహనాన్ని తయారు చేశామన్నారు. ఇండియా, బంగ్లాదేష్, బర్మా, దుబాయ్, ఇతర దేశాల వివిధ కళాశాలల నుంచి 102బృందాలు ఈకార్యక్రమంలో పాల్గొనగా, వీరిలో టాప్-22స్థానంలో నిలిచిందన్నారు. ఇంపీరియల్ సోసైటి ఆఫ్ ఇన్నోవేటీవ్ ఇంజనీర్స్ వారు నిర్వహించిన మొదటి, రెండు రౌండ్స్‌లో ప్రతిభ కనబరచి ఫైనల్స్ రౌండ్‌కు చేరిందన్నారు. చివరిరౌండ్‌లో గ్రేటర్ నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్కూట్ జరిగిన పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. వాహన తయారీకి సుమారు ఆరుమాసాలు పట్టించదన్నారు. ఈవాహన తయారీకి మెకానికల్ విభాగాపతి సూర్యనారాయణరాజు, ఇసిఇ ప్రొఫెసర్ జిలానీ, రిజ్వాన్‌ఆలీ, ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ అనీల్ సహాయ సహకారాలు అందించారాన్నారు. వాహన తయారీకి హైబ్రీడ్ టెక్నాలజీని వాడటం జరిగిందని, ఈ వాహనం ఇంధనం, బ్యాటరీ సహాయంతో నడిచేలా తయారుచేసినట్లు తెలిపారు. బ్రేకింగ్ సిస్టమ్, షాక్‌అబ్సార్భ్సన్ సిస్టమ్ విద్యార్థులే తయారుచేసుకున్నట్లు తెలిపారు. 306 సిసి అమెరికన్ ఇంపోర్టెడ్ ఇంజిన్ ఉపయోగించినట్లు తెలిపారు. మూడు విభాగాల విద్యార్థుల సమన్వయంతో తయారీచేసిన వాహన తయారీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, షీల్డ్ బహుమతి ప్రధానం చేసినట్లు తెలిపారు. విద్యార్థులను మిట్స్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.