చిత్తూరు

ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 22: రాష్ట్ర విభజన తరువాత రాజధాని కూడా లేకుండా, రూ.16వేల కోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తుండటం చూసి ఓర్వలేక, భయపడి ప్రధాని మోదీ ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీకి మోసం చేసిన మోదీని వదలి పవన్, జగన్‌లు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమన్నారు. బాబు కోర్టులో నిలబడక తప్పదని వైకాపా ఎంపీ విజయ్‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే, కోర్టుల చుట్టూ తిరిగి అలవాటుపడ్డ వారు, తమ భవిష్యత్తును ముందుగానే చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు. నీతి, నిజాయితీలకు నిలువుటద్దమైన చంద్రబాబు నాయుడుపై ఇలాంటి విమర్శలు మరోసారి చేస్తే సహించేదిలేదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉన్న ఇంటిని కూడా అమ్ముకునే స్థితిలోవున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన తనయుడు అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తన తండ్రిలా తానూ సీఎం అయితే మరింతగా దోచుకోవాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఏ-2 నిందితుడిగావున్న విజయ్‌సాయిరెడ్డిని ఎంపీని చేసి ప్రధాని కార్యాలయం చుట్టూ తిప్పుతూ కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ 12 కేసులో ఏ-1 నిందితుడిగా చార్జిషీట్లలో కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ముందు శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడుపుతున్న చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తాను సీఎం కాలేమన్న భయంతో పవన్‌కల్యాణ్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ, వైకాపా నేతలు కలసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నీలం బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీతో కలసి ఉన్నంత వరకు పట్టిసీమ, పోలవం బాగుందని పొగిడిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రి గడ్కరీ ఇప్పుడు వీటిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే యూపీఏ ప్రభుత్వానికి పట్టిన గతే ఎన్డీయేకు తప్పదని హెచ్చరించారు.