చిత్తూరు

స్మార్ట్‌సిటీపై కమిషనర్ హరికిరణ్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 22: తుడా కార్యాలయంలో గురువారం స్మార్ట్‌సిటీకి సంబంధించిన అంశాలపై కమిషనర్ హరికిరణ్ సమీక్షించారు. ఇందులో నగర పాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ స్కూల్స్‌లోని ఉపాధ్యాయులకు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బయోమెట్రిక్ ద్వారా హాజరును ప్రవేశపెట్టి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అలాగే 30 ప్రాధమిక పాఠశాలలు, 9 హైస్కూల్స్, 5 అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌ను మదర్ అండ్ చిల్డ్రన్ హెల్త్ సెంటర్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ- ఔషధ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి మున్సిపల్ హాస్పిటల్స్‌కు మెడిసిన్ సరఫరా చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తారు. మున్సిపల్ వర్కర్స్‌కు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 డివిజన్లలో ఉన్న బయోమెట్రిక్స్ పరికరాల సంఖ్యను పెంచాలని నిర్ణయించా. నగరంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి గోడపత్రికలు అంటించే వారిపై నిఘాను పెంచి చర్యలు తీసుకునే అంశంపైన చర్చించారు. నగరంలో నీటి సరఫరా విధానాన్ని అలాగే స్మార్ట్ వాటర్ మీటర్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్‌సిటీ కన్సల్టెంట్ ఏఈకామ్ ప్రతినిధులు, నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలలో చెడిపోయిన కోడిగుడ్లు
* చిన్నారులకు తప్పిన ప్రమాదం
కల్లూరు, మార్చి 22 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న కోడిగుడ్లు చెడిపోయిన సంఘటన పులిచెర్ల మండలం పాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం వెలుగుచూసింది. పాళెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందయ్య తెలిపిన వివరాల మేరకు.... పులిచెర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పథకానికి ప్రైవేటు ఏజన్సీ ద్వారా కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. గురువారం ఉదయం ఎప్పటిలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు అందించేందుకు మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలకు ప్రధానోపాధ్యాయుడు కోడిగుడ్లు అందించారు. మధ్యాహ్న భోజనం నిర్వహకులు గుడ్లు ఉడకబెట్టగా గుడ్లు మధ్యలో నల్లగా కనిపించడంతో అనుమానం వచ్చి ప్రధానోపాధ్యాయులకు చూపించారు. హెచ్‌ఎం ఆనందయ్య ఉడకబెట్టిన గుడ్లును పరిశీలించారు. కుళ్లిపోయినట్లు గుర్తించిన అనంతరం ఉడకబెట్టని గుడ్లును కూడా నీటిలో వేసి చూడగా తేలిపోవడంతో చెడిపోయినట్లు హెచ్‌ఎం తెలిపారు.
* విద్యార్థులు కుళ్లిన కోడిగుడ్లును తిని ఉంటే ప్రమాదం
మధ్యాహ్న భోజనం పథకంలో అందిస్తున్న కోడిగుడ్లు పాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం కోడిగుడ్లు చెడిపోవడం వెలుగుచూసిన సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కుళ్లిన కోడిగుడ్లను విద్యార్థులు తింటే ప్రమాదం జరిగేదని, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, ప్రధానోపాధ్యాయులు సకాలంలో స్పందించడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పిందని తెలిపారు.
* ఇలాంటి సంఘటన పునరావృత్తం కాకుండా చర్యలు- ఎంపిపి
పాళెం ప్రభుత్వ పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు వెలుగు చూసిన సంఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపిపి మురళీధర్ తెలిపారు. కోడిగుడ్లు అందిస్తున్న ఏజన్సీతో మాట్లాడుతామని, నాసిరకం గుడ్లు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకుంటామని ఎంపిపి తెలిపారు.