చిత్తూరు

ఉమ్మడి రాష్ట్రాల్లో స.హ. చట్టం వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: సమాచార హక్కు చట్టం వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా అక్టోబర్ నెలలో వారం రోజులపాటు సమాచార హక్కు చట్టం వారోత్సవాలను ఉమ్మడి రాష్ట్రాల్లోని మండల, డివిజన్ స్థాయిల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు చట్టం కమిషనర్ వర్రె వేంకటేశ్వర్లు చెప్పారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్ అండ్ బి, డైయిరీ, ఫైనాన్స్, ట్రాన్స్‌పోర్టు, హౌసింగ్, మత్స్యశాఖ సంస్థలకు సంబంధించిన కేసులను ఆయన పరిశీలించి 20 కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని శాఖలకు ఈ చట్టం వర్తిస్తుందని, ప్రభుత్వ నిధులు వినియోగం, అధికారుల పనితీరుపై అవసరమైన అవగాహన పొందేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. సమాచారం కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినా, నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వక పోయినా, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారికి జరిమానా విధించడంతోపాటు, శాఖాపరంగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్, రెవిన్యూ శాఖలపైనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. గతంలో కేసుల పరిష్కారానికి రెండు సంవత్సరాలు పడితే ఇప్పుడు తక్కువ సమయంలోనే కేసులు పరిష్కరించడానికి కమీషన్ కృషి చేస్తోందని వివరించారు.