చిత్తూరు

ప్రజా చైతన్య కోసమే సైకిల్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 25: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిన అన్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి అన్నారు. బుధవారం తిరుపతిలోని 16,17,18,19 వార్డుల్లో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంను నమ్మి వెంట నడిచినందుకు ఏపీ ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్రల్లో ప్రజలు పెద్ద ఎత్తున బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ సూరాసుధాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, గంగమ్మగుడి చైర్మన్ ఆర్సీ మునికృష్ణ, నాయకులుకృష్ణ యాదవ్, నగర అధ్యక్షుడు దంపూరి, తాళ్లపాక దేవరాజులు, ఆనంద్ యాదవ్, బ్యాంకు శాంతమ్మ, అరుణ, అనిత, ఉంగరాల హరి, ధనంజయనాయుడు, చెంగయ్య నాయుడు, బుజ్జిబాబు, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ఇన్చార్జ్ సీవీఎస్వోగా శివకుమార్ రెడ్డి
తిరుపతి, ఏప్రిల్ 25: టీటీడీ సీవీఎస్వోగా ఉన్న ఆకే రవికృష్ణ కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో జేడీగా బదిలీ కావడంతో ఆ బాధ్యతలను అడిషినల్ సీవీఎస్వోగా ఉన్న శివకుమార్ రెడ్డికి అప్పగిస్తూ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఆయన ఈఓ చేతుల మీదుగా అందుకుని బాధ్యతలు చేపట్టారు.