చిత్తూరు

పరిసరాల శుభ్రతతోనే రోగాలు నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 25: పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలకు ఆస్కారం ఉండదని ప్రజలు పరిసరాల శుభ్రతపై మక్కువ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయగౌరి తెలిపారు. బుధవారం మలేరియా దినోత్సవం సందర్భంగా నగరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి విజయగౌరి జెండా ఊపి ప్రారంబించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదిన మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ప్రధానంగా ఈ మలేరియా వ్యాధి దోమకాటువలనే సంబవిస్తుందని, పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమల తాకిడి ఉండదన్నారు. మలేరియాను ఓడించడానికి అందరూ కృషి చేయాలన్నారు. దోమకాటు వల్ల అనేక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వీటిని నిర్మూలించాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పరిసరాల పరిశుభ్రత పట్ల మక్కువ చూపితే ఈ రోగాలను పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ కొనసాగింది. ఈకార్యక్రమంలో పలువురు వైద్య ఆరోగ్యశాఖాధికారులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.