చిత్తూరు

మోదీని తెలుగు ప్రజలు క్షమించినా వెంకన్న క్షమించడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 25: ఆంధ్రరాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు ప్రజలు క్షమించిన వెంకన్న మాత్రం క్షమించడని ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సాయినిర్మలారామయ్య కల్యాణ మండపంలో ఆప్స్ ఆధ్వర్యంలో మోదీపై తెలుగోడి తిరుగుబాటు సభ జరిగింది. ఈసభకు అధ్యక్షత వహించిన రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందనే విషయం అంగీకరిస్తూనే ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి ఎన్నికల సభలో వెంకన్న సాక్షిగా మోదీ ప్రకటించారన్నారు. కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రప్రజల సమస్యల గురించి కాని, రాష్ట్భ్రావృద్ధి గురించి కాని పట్టించుకోలేదన్నారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించిన మోదీని వెంకటన్న క్షమించడని, ఆయన పతనం తప్పదని హెచ్చరించారు. సేవ్ విద్యా సంస్థల అధినేత వై.ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా, ఇచ్చిన అరకొర నిధులే ఎక్కువన్నట్లు మాట్లాడటం మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా, ఇచ్చిన నిధులను ఎక్కువచేసి చూపడం దారుణమని, ఇందుకు రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత చదలవాడ సుచరిత మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ స్థాయిలో నిర్వహిస్తే బీజేపీ ప్రభుత్వం మాట వింటుందన్నారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా తొలగిస్తామంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి, ఏపీకి ప్యాకేజీ పేరుతో మొండి చెయ్యి చూపారని అన్నారు. నాన్‌పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు మాట్లాడుతూ బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యంపైన, రాజ్యాంగం, పార్లమెంట్‌పైన విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ రవిశంకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎ.అయ్యస్వామి మాట్లాడుతూ విద్యార్థులు తలచుకుంటే ఎంతటి ప్రభుత్వాలైనా కూల్చివేసిన చరిత్ర ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీని కూడా గద్దె దించే ఉద్యమాలను చేపడతామన్నారు. శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య వరలక్ష్మి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. జూలైలోపు హోదా ఇవ్వకపోతే ఆగస్టు నుంచి విద్యాలయాలు ఉద్యమ నిలయాలుగా మారుతాయన్నారు. ఈ సందర్భంగా మే 3న విజయవాడలో రాష్టస్థ్రాయి సభ జేఏసీ ఏర్పాటు చేయాలని, 9న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని, 27న దక్షిణ భారత తెలుగు సంఘాల సదస్సు తిరుపతిలో నిర్వహించాలని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 28,29,30 తేదీల్లో ప్రచారం నిర్వహించాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, విశాఖ రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో జర్నలిస్టు సంఘం నాయకుడు కృష్ణాంజనేయులు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు జె.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, నాయకులు ధనంజయులు నాయుడు, క్రిష్ణమనాయుడు, సురేష్, విజయలక్ష్మి, నిర్మల, డాక్టర్ రాజారావు, డాక్టర్ యుగంధర్, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు బీఎస్ బాబు, విజయ్‌కుమార్, మురళీకృష్ణ, వై.బాలాజీ, ఆప్స్ నాయకులు రఫీ హిందుస్థానీ, ఆర్డీ సుబ్రమణ్యం, కుర్రం శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయ పార్టీలు కలిసి రావాలి
*ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్

చిత్తూరు, ఏప్రిల్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరులో ఆయన విలేఖరలతో మాట్లాడుతూ నేడు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరుని అన్యాయం చేసిందని ఆరోపించారు. సినీ పరశ్రమలోని అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఉద్యమ నినాదంతో ముందుకు వస్తున్నాయని, ఈ ఉద్యమానికి మద్దతు తెలపని రాజకీయ పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై వివక్షత చూపుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలన్నారు. రాజకీయ పార్టీలు జెండాలను అజెండాలను పక్కన పెట్టి ఈ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపు నిచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో సాంప్రదాయ జల్లికట్టును సాధించేందుకు అక్కడ సినీ పరిశ్రమ ఏకమైందని, ప్రజల మనోభావాలను గుర్తించి ఇక్కడ సినీ పరిశ్రమ అగ్రహీరోలు ఈ ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. కర్నాటకా ఎన్నికల్లో బీజేపీని ఓడించమని అక్కడ తెలుగు వారికి పిలుపు నిస్తున్నామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని అక్కడి తెలుగు వారికి వివరించడానికి త్వరలో కర్నాటకాలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.