చిత్తూరు

టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటు తరువాత పూర్తిస్థాయిలో సర్వదర్శనం కౌంటర్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 26: మరో రెండు రోజుల్లో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయనుందని, ఆ తరువాత సర్వదర్శనం కౌంటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం త్వరలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం టీటీడీ ఉద్యోగులకు, టీసీఎస్ సిబ్బందికి ప్రయోగాత్మకంగా టీటీడీ టోకెన్లు జారీ చేసింది. తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేశారు. ఈసందర్భంగా జేఈఓ మాట్లాడుతూ క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్‌లో ఆధార్ నెంబరు ద్వారా వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానం విజయవంతమైందని చెప్పారు. ప్రస్తుతం న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డును పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్టాండులోని కౌంటర్లలో కొన్ని రోజులపాటు పరిమిత సంఖ్యలో భక్తులకు టోకెన్లు మంజూరుచేసి అప్లికేషన్ పనితీరును పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈ రామచంద్రా రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఇన్చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, విఎస్వో రవీంద్రారెడ్డి, ఈఈలు ప్రసాద్, వేంకటేశ్వర్లు, ఈడీపీ ఓఎస్డీ బాలాజీ ప్రసాద్, టీసీఎస్ అధికారి సత్య, ఆర్టీసీ డీఎం లక్ష్మీనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

30న సీఎం సభను విజయవంతం చేద్దాం
* జన సమీకరణకు అందరూ కృషి చేయాలి * కమిటీలు ఏర్పాటు చేసిన మంత్రులు అచ్చెన్నాయుడు, అమరనాథ్‌రెడ్డి

తిరుపతి, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సీఎంపై నిందలు మోపుతున్న తీరును ఎండగడుతూ ఈనెల 30న తిరుపతిలో జరిగే సభను విజయవంతం చేసే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి చెప్పారు. గురువారం తిరుపతిలో జరిగిన టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం పాల్గొనే సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సభ నిర్వహణపై కమిటీలను వేశారు. అనంతరం ఎస్వీయూ తారకరామా క్రీడామైదానాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రధాని మోదీ తిరుపతి నుంచి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, నిధులు ఎక్కువ ఇచ్చామని, ఖర్చులు చూపించలేదని, అవినీతి జరిగిందని ఆరోపించడం దారుణమన్నారు. తమ రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం 5కోట్ల మంది ఆంధ్రులను మోసం చేయాలనుకోవడం సరికాదన్నారు. దీనిని ప్రజలకు తెలియజేయడానికే సీఎం ఈనెల 30న బహిరంగ సభలో పాల్గొంటారని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తారన్నారు. ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, ఆదిత్య, శంకర్, సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, చిత్తూరు మున్సిపల్ మేయర్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్యే మోహన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సూరా సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ సుధారాణి, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, కార్యదర్శులు నీలం బాలాజీ, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, గంగమ్మగుడి చైర్మన్ ఆర్సీ మునికృష్ణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్‌వర్మ, అశోక్‌రాజు పాల్గొన్నారు. కాగా మీడియా కమిటీలో డాక్టర్ సుధారాణి, శ్రీ్ధర్‌వర్మ, ఆర్సీ మునికష్ణలను నియమించారు.