చిత్తూరు

తల్లిదండ్రులను పట్టించుకోని మీరు బిడ్డలా.. రాక్షసులా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, ఏప్రిల్ 26: తమ బిడ్డలు సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయోజకులై సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటే మురిసిపోవాలని తల్లిదండ్రుల ఆరాటం అంతా ఇంతా కాదు. ప్రయోజకులైన అలాంటి బిడ్డలే తల్లిదండ్రుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తే వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితిని ఎవరు పట్టించుకోగలరు. వివరాల్లోకి వస్తే.. ఏర్పేడు మండలంలోని సరస్వతీకండ్రిగ గ్రామానికి చెందిన కందప్పగారి నడిపి బత్తిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈయన 7 ఎకరాల భూస్వామి. అందరికీ పెళ్లిళ్లు చేసిన బత్తిరెడ్డి తన పెద్ద కుమారుడు సుబ్రమణ్యంరెడ్డికి, చిన్న కుమారుడు చిన్నబత్తిరెడ్డిలకు 3 ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చాడు. ఒక ఎకరం పొలాన్ని వృద్ధ దంపతుల భృతి కోసం ఉంచుకున్నారు. తండ్రి పొలాన్ని చిన్న కుమారుడే సాగు చేసి ఏడాదికి 6వేల రూపాయలు కౌలు చెల్లించేవాడు. మూడు సంవత్సరాలుగా కౌలు చెల్లించక పోవడంతో చిన్న కొడుకుని బత్తిరెడ్డి నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లమన్నాడు. దీంతో గతంలో ఎస్సైగా పనిచేసిన రామక్రిష్ణకు, సీఐ సాయినాథ్‌కు బత్తిరెడ్డి ఫిర్యాదు చేశాడు. అప్పుడు సామా అంకయ్య అనే పెద్దమనిషి పెద్దాయనకు న్యాయం జరిగేటట్లు చూస్తానని నమ్మ బలికాడు. పెద్దాయనను కలెక్టర్ వద్దకు వెళ్లకుండా చేశారు. ఇంతలోనే బత్తిరెడ్డి భార్య అనారోగ్యంతో మంచం పట్టినా పిల్లలు ఎవరూ పట్టించుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతటి దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్న తనకు న్యాయం చేయాలంటూ బత్తిరెడ్డి గురువారం ఏర్పేడులో విలేఖర్ల సమావేశంలో తన గోడు వెల్లబోసుకున్నాడు. అధికారులు స్పందించాల్సి ఉంది.