చిత్తూరు

అన్ని శాఖల సమన్వయంతోనే సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 26: అన్ని శాఖల సమన్వయంతోనే తిరుపతి నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యదర్శి కరికాలవల్లవన్ అధికారులకు సూచించారు. గురువారం తుడా సమావేశ మందిరంలోనగరపాలక సంస్థ కమిషనర్, అధికారులు, స్మార్ట్‌సిటీ కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులు, తుడా, ఆర్టీసీ, రైల్వే, పోలీస్, ఎస్పీడీసీ ఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేయాల్సిన పనులు, తదితర అనేక విషయాలపై అన్ని శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరికాలవల్లవన్ మాట్లాడుతూ తిరుపతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అన్ని శాఖల అధికారులు ఒక తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. వీలైనంత త్వరగా తిరుపతిలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించుకునేందుకు వీలుంటుందన్నారు. తిరుపతిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు పనులను త్వరగా పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులను సమన్వయపరుచుకుని పనులు పూర్తి చేస్తామన్నారు.

శాఫ్ సభ్యులుగా చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీ్ధర్ వర్మ, రజని
తిరుపతి, ఏప్రిల్ 26: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులుగా చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు తిరుపతికి చెందిన శ్రీ్ధర్ వర్మను, చంద్రగిరికి చెందిన ఈ.రజనీని చిత్తూరు జిల్లా నుంచి నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఫ్ సభ్యులుగా రాజమండ్రికి చెందిన ఎర్రా వేణుగోపాల్ నాయుడు, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పి.గిరిధర్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా అముదాల వలసకు చెందిన నీలంశెట్టి లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన రవీంద్రనాథ్‌లను కూడా సభ్యులుగా నియమించారు. ఏపీ ఎస్సీ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చిత్తూరు జిల్లా నుంచి ఎ.పీటర్‌ను సభ్యులుగా నియమించారు. ఏపీ మినిమం వేజెస్ బోర్డు సభ్యులుగా జేవీ నరసింహమూర్తిని నియమించారు. ఈ కమిటీలో వివిధ జిల్లాలకు చెందిన 15 మందిని నియమించారు. తోళ్ల పరిశ్రమ అభివృద్ధి సంస్థ కమిటీలో 7 మంది ఉన్నా చిత్తూరు జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇదిలావుండగా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎన్‌ఆర్ రాజు కుమారుడు శ్రీ్ధర్ వర్మ నియమితులు అవుతారని తొలి నుంచి ప్రచారంలో ఉన్నా చివరి నిమిషంలో సభ్యుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మంత్రి అమరనాథ్‌రెడ్డి శ్రీ్ధర్ వర్మను బుజ్జిగించడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారు. విశాఖపట్నం పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్యమతస్థురాలు అనే అంశంపై చెలరేగిన వివాదంతో ఆమె తన పేరును ధర్మకర్తల మండలి నుంచి తొలగించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె స్థానంలో శ్రీ్ధర్ వర్మకు స్థానం దక్కే అవకాశం ఉందని మరోసారి ప్రచారం సాగింది. అయితే అనిత పేరును ధర్మకర్తల మండలి సభ్యుల నుంచి తొలగించినా శ్రీ్ధర్ వర్మకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో శ్రీ్ధర్‌వర్మకు శాఫ్‌లో అవకాశం లభించింది. ఈ నియామకం పట్ల కూడా శ్రీ్ధర్‌వర్మ వర్గీయుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇదిలావుండగా సూరా సుధాకర్ రెడ్డికి గ్రంధాలయ బోర్డు డైరెక్టర్‌గా అవకాశం లభించింది. ఆయన అనుచరుల్లో దీనిపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే సూరా సుధాకర్ రెడ్డి మాత్రం అధినేత మాటకు గౌరవం ఇవ్వడం, పార్టీకి పనిచేయడమే తన ధర్మమమని తన అనుచరులకు హితబోధ చేస్తున్నారు. టీడీపీలో ఉండాల్సిన క్రమశిక్షణ ఇదేనంటూ ఉద్బోధిస్తున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పదవులు దక్కినా తమకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి మాత్రం విస్పష్టంగా కనిపిస్తోంది.