చిత్తూరు

ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 26: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా గురువారం ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అయిన గిరిషా నోటిఫికేషన్‌తోపాటు ఇందుకు సంబంధించిన ఓటరు జాబితాను కూడా విడుదల చేశారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఎన్నికలకు నామినేషన్లను వచ్చేనెల 3వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని, ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు వివరించారు. 4వ తేదీన నామినేషన్ పరిశీలన, 7వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ వచ్చే నెల 21వ తేదీన జరుగుతుందని, ఓట్ల లెక్కింపు 24న జరగనున్నట్లు ఆయన వివరించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు నిబంధనల మేరకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నామినేషన్ వేయదలచే అభ్యర్థులు కేవలం ఐదు మందితోనే రావాలని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 1172మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో చిత్తూరు డివిజన్‌లో 554, తిరుపతిలో 221, మదనపల్లిలో 557మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో మూడు డివిజన్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతుందన్నారు. ఓటరు జాబితాలో ఏవైనా పొరబాట్లు ఉంటే ఏడు రోజుల్లో క్లైమ్‌లు సమర్పించాలని సూచించారు. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఓసీలు అయితే 10వేల రూపాయలు దరఖాస్తు సొమ్మును చెల్లించాల్సి ఉందని, ఎస్సీ, ఎస్టీలు 5 వేల రూపాయలను, నామినేషన్ వేసే అభ్యర్థిని పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని, విధిగా నామినేషన్ వేసే అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటరు జాబితాలో ఓటరుగా ఉండాలని తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట భారీ బందోబస్తు
ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో తలబడే అభ్యర్థులు తమ నామినేషన్లను జిల్లా కలెక్టరేట్‌లోని జెసి ఛాంబర్‌లో దాఖలు చేయాల్సి ఉంది. కలెక్టరేట్ ఎదుట ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పలువురు డీఎస్పీల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి వాహనంతో పాటు ప్రజలను కూడా తనిఖీ చేసి పంపుతున్నారు. ఈ బందోబస్తు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.
పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు లభించింది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్సీ దొరబాబు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సునీల్‌కుమార్‌కు, నగరిలో చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే ఆర్.కె.రోజాలకు, మదనపల్లి మున్సిపాల్టీలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తిప్పారెడ్డి, శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పుంగనూరు మున్సిపాల్టీలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, పలమనేరులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అమరనాధ్‌రెడ్డికి ఓటర్లుగా అవకాశం దక్కింది. వీరందరూ స్థానిక మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కావడంతో వీరికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.

రైతు కుప్పారెడ్డి మృతితో వేపకుప్పంలో విషాదఛాయలు
రామచంద్రాపురం, ఏప్రిల్ 26: కలెక్టరేట్‌లో సోమవారం పురుగుల మందు తాగిన కుప్పారెడ్డి బుధవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుప్పారెడ్డి మృతితో మండల పరిధిలోని ఆయన సొంత గ్రామమైన వేపకుప్పంలో గురువారం విషాదఛాయలు అలుముకున్నాయి. తనకు గతంలో ఇచ్చిన డీకేటీ భూమికి పట్టా ఇవ్వలేదన్న బాధతో కుప్పారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. రుయా ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తహశీల్దారు కార్యాలయం ముందుకు తీసుకువచ్చి ధర్నా చేస్తారన్న సమాచారంతో పోలీసులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాకపోవటంతో పోలీసులు, రెవెన్యూ వారు ఊపిరి పీల్చుకున్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
పీలేరు, ఏప్రిల్ 26: మండల పరిధిలోని ముడుపులవేముల గ్రామం తానావడ్డిపల్లి జాతీయ రహదారిపైన గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రాణదానం పథకానికి 104 మంది పేద రోగుల ఎంపిక
తిరుపతి, ఏప్రిల్ 26: స్విమ్స్‌లో గురువారం జరిగిన ప్రాణదాన కమిటీ సమావేశం 104 మంది పేద రోగులను ఉచిత శస్తచ్రికిత్సలకు ఎంపిక చేశారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆంకాలజీలో 31, నెఫ్రాలజీ 13, న్యూరోసర్జరీ 32, న్యూరాలజీ 07, గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2, కార్డియోథెరాసిక్ 14, మెడిసిన్ 3, అనస్థీషియాలజీ 1, బర్డ్ ఆస్పత్రి ఒక్కరిని ఉచిత శస్తచ్రికిత్సలకు ఎంపిక చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితి, బియ్యం కార్డు కలిగి ఉండి దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలను ఎంపిక చేస్తారు.