చిత్తూరు

ఘనంగా ముగిసిన పద్మావతీ అమ్మవారి పరిణయోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 26: శ్రీ పద్మావతీ, శ్రీనివాసుల పరిణయ మహోత్సవం గురువారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకిపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయోత్సవం మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజులు మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర పెండ్లి వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. నాదస్వరం కళాకారులు నీలాంబరి, భూపాల, మధ్యమావతి, తదితర రాగాలను పలికించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఈ వేడుక ముగిసిన తరువాత స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.