చిత్తూరు

స్విమ్స్‌లో మూర్చ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులు ఇవ్వాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుపుతున్న స్విమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మూర్చ వ్యాధి గ్రస్తులందరికీ ఉచితంగా మందులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోగులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్విమ్స్ ఓపీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆప్ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రంజిత్‌కుమార్, ఆప్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి మాట్లాడుతూ స్విమ్స్‌లో ప్రతి రెండు నెలలకు ఒక మారు మూడవ ఆదివారం మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్స, మందులను ఉచితంగా ఇస్తారని, ప్రస్తుతం కొత్తగా ఓపీ నమోదు చేసుకునే వారికే ఉచిత మందులు ఇస్తామని, పాత ఓపీ దారులకు మందులు ఇవ్వలేమని చెప్పడంతో సుదూర ప్రాంతాలైన ఒంగోలు, కడప, మదనపల్లె, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మూర్ఛ వ్యాధిగ్రస్తులకు మందులు లేక అక్కడే కొంత మంది మూర్ఛ వచ్చి పడిపోయారన్నారు. మూర్చ వ్యాధిగ్రస్తులకు మందులు ఇచ్చేందుకు ఆసుపత్రికి డబ్బులు లేవనడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అంత ఆదాయం గల టీటీడీ పేదవారికి మందులు ఇచ్చేందుకు డబ్బులు లేవనడం విడ్డూరమన్నారు. టీటీడీ డబ్బులను కృష్ణా, గోదావరి పుష్కరాలకు, వివిధ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతూ పేద రోగులకు మందులు ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు. ఆప్ తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జ్ నీరుగట్టు నగేష్, బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వినాయక రెడ్డి మాట్లాడుతూ మందులు లేవని సాకులు చెబుతున్న స్విమ్స్ అధికారులు అదే మందులు స్విమ్స్ మెడికల్ షాపులలో ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్నారన్నారు. పేదవారు వివిధ రోగాలతో స్విమ్స్‌కు వస్తే వారికి వైద్యం అందించక మొదటగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం బాధాకరమని, స్వామివారి పేరుతో ఏర్పాటైన స్విమ్స్ సేవా భావంతో కాకుండా వ్యాపారంగా మార్చారని విమర్శించారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా నిర్వహించినా ఏ మాత్రం స్విమ్స్ అధికారులు పట్టించుకోకుండా ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ఆందోనకారులు డోరును నెట్టుకొని వెళుతుంటే పోలీసులు, స్విమ్స్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా, ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. తర్వాత పోలీసులు స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, మాజీ డైరెక్టర్ వెంగమ్మలను సంప్రదించి జూన్ నెల మూడవ ఆదివారం నుంచి ప్రతినెలా ఉచితంగా మందులు ఇస్తామని డాక్టర్ శివకుమార్ ఆందోళన కారుల దగ్గరకు వచ్చి హామీ ఇవ్వగా, ఆందోళనలు విరమించి, అలా ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆప్స్ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, హిందూస్తానీ, ఎన్‌ఎస్‌ఎఫ్ విభాగం కన్వీనర్ నీలా భాస్కర్, గౌతం రాజశేఖర్, ప్రసాద్, తిరుమలరెడ్డి, పెద్ద ఎత్తున మూర్చరోగులు పాల్గొన్నారు.