చిత్తూరు

వికేంద్రీకరణ ద్వారానే అవినీతి నిర్మూలన సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: వికేంద్రీకరణ ద్వారానే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ అజేయకల్లాం స్పష్టం చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో మనకోసం మనం చైతన్య గోష్టి కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా అజేయకల్లాం రచించిన మేలుకొలుపు పుస్తకాన్ని రాష్ట్ర మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అజేయకల్లాం మాట్లాడుతూ అభివృద్ధి, పాలనను వికేంద్రీకరించాలన్నారు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలని చెప్పారు. కేంద్రీకృత ధోరణులు అవినీతిని పెంచుతాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 5వ స్థానంలో ఉందని చెప్పారు. లక్షలాది కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం అవసరం లేదని, పాలన సంస్థలన్నింటిని 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని పేరుతో రియలెస్టేట్ వ్యాపారం చేయకూడదన్నారు. ఒకే చోట అన్ని సంస్థలుండటం వల్ల ఉద్యోగస్థులకు, ఎమ్మెల్యేలకు తప్ప ప్రజలెవరికీ ఉపయోగం లేదన్నారు. రాయలసీమలో 30శాతం పాలనా సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచంలో 12వ తరగతి వరకు ప్రభుత్వం విద్యను అందిస్తుంటే మన దేశంలో విద్య వ్యాపారంగా మారిందన్నారు. 2 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయ ఉత్పత్తి ఉన్న భారత దేశంలో ప్రతి సంవత్సరం 16 లక్షల మంది ఇంజినీర్లు తయారు అవుతుండగా 16 ట్రిలియన్ల డాలర్లు స్థూల జాతీయ ఉత్పత్తి ఉన్న అమెరికాలో 2 లక్షల మంది ఇంజినీర్లు మాత్రమే తయారవుతున్నారన్నారు. నాడు త్యాగాలు చేసిన హీరోలు రాజకీయాల్లోకి వస్తే, నేడు దోపిడీ దారులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. 1980కి ముందు రాజకీయ నేతలు తమ ఆస్తులను అమ్ముకుంటే నేటి నేతలు లక్షలాది కోట్లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన చెప్పారు. వారసత్వ రాజకీయాలను, కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరించాలన్నారు. ఏపీలో దాదాపు 150 కుటుంబాలు మాత్రమే రాజకీయాలను శాసిస్తున్నాయని చెప్పారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని, ప్రజలను చైతన్యపరచడానికే మేలుకొలుపు పుస్తకం రాశానని అజేయకల్లాం చెప్పారు. ప్రజల అజెండాను రూపొందించి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి రానున్న ఎన్నికల్లో ప్రజల ఎజెండా అమలుకు ప్రయత్నించాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు అవినీతి కేంద్రాలుగా మారాయన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ జోక్యం పెరిగి పరిశోధనలు జరగటం లేదని, విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. శివరామక్రిష్ణ నివేదికను బుట్టదాఖలు చేసి మూడు పంటలు పండే 33వేల ఎకరాల వ్యవసాయ భూమిని రాజధాని పేరుతో ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యం ధన స్వామ్యంగా మారిందని రాజ్యసభ సీటు రావాలంటే వందలాది కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ జన్మభూమి కమిటీలతో పంచాయతీ వ్యవస్థను ఎంఎల్‌ఏ రాజ్యంతో మండల పరిషత్‌ను, ఇన్చార్జ్ మంత్రితో జిల్లా పరిషత్తులపై పెత్తనం చెలాయిస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రీకృత ధోరణులు మానుకుని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అమరావతిని మరో హైదరాబాదుగా మార్చి మరలా తెలుగు జాతిని విచ్ఛినం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఏపీలో అవినీతి గణనీయంగా పెరగడంవల్ల ఎన్నికల వ్యయం తారాస్థాయికి చేరిందన్నారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ మన్నవరం ప్రాజెక్టును నేటి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాతం కూడా కృషి చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పి.నవీన్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య పి.రాఘవరెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, శే్వత మాజీ డైరెక్టర్ భూమన్, సీపీఎం జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, నేషనల్ ఎస్సీ, ఎస్టీ కౌన్సిల్ ఆఫ్ వెల్ఫేర్ జిల్లా అధ్యక్షుడు టి.దాసు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు, సీనియర్ జర్నలిస్టు ఆలూరి రాఘవశర్మ, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.