చిత్తూరు

జిల్లాలో వర్షంతో అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 20: జిల్లాలో కురిసిన వర్షంతో అపార నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టిండంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రధానంగా విపరీతమైన గాలితో కూడిన వర్షం కారణంగా మామిడి, టమెటో, బొప్పాయి పంటలకు అపార నష్టం కల్గింది. ముఖ్యంగా ఈ ఏడాది వరుసగా వచ్చిన గాలి వానతో మామిడి రైతులు కొలులోలేని విధంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇది వరకు పలు మార్లు కురిసిన గాలివాన కారణంగా మామిడి కాయలు నెలరాలగా, పంట చేతికి వచ్చే సమయానికి శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో గాలివానతో మిగిలిన పంట సైతం నేలపాలు కావడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వచ్చింది. అలాగే పలు చోట్లు టమోటా, బొప్పాయి పంటలకు నష్టం చేకూరింది. పలు ప్రాంతాల్లో గాలి దాటికి విద్యుత్ స్తంభాలు కూలి పోవడంతో విద్యుత్ సరఫారకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ఉరుములు మెరుపులు కూడిన వర్షం కారణంగా ఇండ్లల్లో ఉన్న టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి, రామకుప్పం, గుడిపల్లి, చిత్తూరు, పెనుమూరు.బైరెడ్డిపల్లి తదితర మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించడంతో కోళ్ళ ఫారాలు షెడ్లు కూలి పోగా, పలు చోట్లు ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి, విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంట నష్టంపై వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో వర్షం కురవగా, అత్యధికంగా వాల్మీకీ పుంరలో 49.2 మి,మీ వర్షం కురిసింది. శనివారం ఒక్కరోజే జిల్లా లో సరాసరి 5.7 మి, మీ వర్షం నమోదు అయింది. పెద్దమండ్యంలో 14.2మి,మీ , తంబళ్ళపల్లిలో 9.8, కురబలకోటలో 8, గుర్రంకొండలో 34.6, కలికిరిలో 9.6, కె,వి,పల్లిలో 17.2, నిమ్మనపల్లిలో 13.6, మదనపల్లిలో 11.4, గంగాధర నెల్లూరులో 19.2, చిత్తూరులో 33, గుడిపాలలో 23.6, బైరెడ్డిపల్లిలో 34.6, రామకుప్పంలో 28.4, శాంతిపురంలో 32.4, గుడిపల్లిలో 10.2, కుప్పంలో 7.4 మి,మీ చొప్పున వర్షం కురిసింది.

మామండూరు ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
* మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
రేణిగుంట, మే 20: మండలంలోని మామండూరు వద్ద భక్తులు ప్రయాణం చేస్తున్న తుఫాన్, ఈచర్ మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెంది పలువురికి గాయాలైన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా మంత్రి అమరనాథరెడ్డి ప్రమాద సంఘటనపై అధికారులను అడిగి తెలుసుకొని సహాయక చర్యలపై ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడు, అర్బన్ తహశీల్దార్ చంద్రమోహన్, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన నారాయణ మ్మ (70), నారాయణ శెట్టి (55), రమాదేవి (50), ప్రవీణ్‌కుమార్ (32), దేవాన్ష్(11 నెలలు) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుల బంధువులు కర్నూలు జిల్లా గడివేముల మండలం కరటమద్దిగ్రామం నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. వారికి మృతదేహాలను అప్పగించి ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి చేరుకునే ఏర్పాట్లను కలెక్టర్ చేపట్టారు. తీవ్రంగా గాయపడి రుయాలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కరీముల్లా (35), స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న తనీష్ (7), ఇలియాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేంద్రకుమార్ (22), రేణుక (24), మధుజయకుమార్ (18) లను కూడా కలెక్టర్ పరామర్శించారు. ఇలియాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేణుక కుమారుడు తనీషకు స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

రెండుమాసాలలో నిరుద్యోగ భృతి

* మదనపల్లె మినీమహానాడులో రాష్ట్ర మంత్రి అమరనాధరెడ్డి
మదనపల్లె, మే 20: రానున్న రెండుమాసాలలో రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ భృతి అందజేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నూతనకాల్వ అమరనాధరెడ్డి స్పష్టం చేశారు. జూన్ నాటికి వందశాతం రేషన్‌కార్డులు, పింఛన్‌లు పూర్తిచేస్తామన్నారు. సంక్రాంతి నాటికి జిల్లాలో హంద్రీ-నీవా నీటి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోగా జిల్లాలోని పడమటి టమోటా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి, నేరుగా చైనాకు ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అవగాహనతో 2019ఎన్నికలకు జరుగుతున్న మినీ మహానాడుతో నాంది పలుకుతోందన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, కార్యకర్తల పార్టీకి ప్రధాన అండ అనే నినాదం తెలుగుదేశం పార్టీలో ఉందన్నారు. పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలే అని ఆదివారం మదనపల్లె మినీ మహానాడులో రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమరనాధరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక జిడ్డుక్రిష్ణమూర్తి మున్సిపల్ టౌన్‌హాల్‌లో పట్టణ అధ్యక్షులు పులిమోహన్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గం మినీమహానాడుకు ముఖ్యఅతిథులుగా మంత్రి అమరనాధరెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షులు పులివర్తినాని, మినీమహానాడుల జిల్లా అబ్జర్వర్ దేశాయ్‌శెట్టి హనుమంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ ఈనెల 27, 28, 29వ తేదీలలో విజయవాడ కేంద్రంగా జరగనున్న మహానాడుకు ముందుగా నియోజకవర్గం, జిల్లా మహానాడులు జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అధికారం చేపట్టి పేద, బడుగు బలహీనవర్గాలు, మహిళల కోసం అమలుచేసిన ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు నేటికి అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజనకు కాంగ్రెస్‌పార్టీ, న్యాయం చేస్తామని మోసం చేసిన బీజేపీ, నేటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, ఇటీవల పుట్టుకొచ్చిన ఉత్తరకుమార పార్టీ నేతలందరూ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. విభజన సమయంలో ఆస్తులన్నీ తెలంగాణాకు అప్పగించి, అప్పులతో కట్టుబట్టలతో విభజించారని, రూ.16వేల కోట్ల లోటుబడ్జెట్‌తో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. నేడు ఇంటివద్దేకు పింఛన్‌లు అందిస్తున్నామని, అమలుచేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్థాయి కార్యకర్తలు ప్రజలలో పదేపదే తీసుకెళ్ళాలని సూచించారు. మదనపల్లె-తిరుపతి, మదనపల్లె-పలమనేరు, మదనపల్లె-రాయచోటి మార్గాలలో వంద అడుగులు, ఫోర్‌లైన్ రోడ్డుకు విస్తరణ పనులు జోరుగా జరుగుతున్నాయన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలలో అర్హులైన పేదలందరికీ కార్పొరేషన్ రాయితీ రుణాలు అందిస్తున్నామన్నారు. గతంలో ఏప్రభుత్వం అమలు చేయని నిరంతర విద్యుత్ సరఫరా ప్రస్తుత ఏపీలో నిరంతరాయంగా పగటిపూట 7గంటల వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అసంపూర్తిగా ఉన్న షాదీమహాల్‌కు రూ.56లక్షలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. గత పాతికేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ఆటోనగర్ పూర్తిచేసామని, త్వరలో రూ.21కోట్లతో ఎంఎస్‌ఎం పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం బీజేపీకి ఉందని, అయితే వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీలో కేంద్రంపై పోరాటం చేయకుండా సీఎం చంద్రబాబుపై చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రాటకొండ గుర్రప్పనాయుడు, టౌన్‌బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ భవానిప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు మిట్స్ కృష్ణకుమార్, నిమ్మనపల్లె ఆర్‌జె వెంకటేష్, మదనపల్లె మండల పార్టీ అధ్యక్షులు దొరస్వామినాయుడు, రామసముద్రం కృష్ణంరాజు, నిమ్మనపల్లె రెడ్డెప్పరెడ్డి, మైనార్టీనాయకులు ఎస్.ఎ.మస్తాన్, పఠాన్ ఖాదర్‌ఖాన్, దాదూఖాన్, రియాజ్, గౌస్‌ఆజామ్, జిల్లాపార్టీ అధ్యక్షులు పులివర్తినాని, అబ్జర్వర్ దేశాయ్‌శెట్టి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ తదితరులు పాల్గొన్నారు.