చిత్తూరు

కర్ణాటకలో ప్రజాస్వామ్యానికే పట్టం కట్టిన సుప్రీం తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: కర్నాటకలో కాంగ్రెస్‌పార్టీ, జేడీఎస్ సంయుక్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పొలకల మల్లిఖార్జున ఆధ్వర్యంలో అందరికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి ప్రమీలమ్మ మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారాయన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీని సాధించలేక పోయినా అక్రమ మార్గాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. అదే తరహాలో కర్ణాటకలోనూ తన అధికారాన్ని ఉపయోగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చని అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలమైందన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని సుప్రీం కోర్టు కాపాడిందన్నారు. పీసీసీ కార్యదర్శులు నైనారు శ్రీనివాసులు, సత్యవేడు నియోజక వర్గ ఇన్చార్జ్ పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ సర్కార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి అనేక అప్రజాస్వామిక, రాజకీయ కుట్రలకు పాల్పడిందని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించి, యడ్యూరప్ప చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం సిగ్గుచేటన్నారు. చివరికి సుప్రీం కోర్టు ఆదేశాలతో తన బలాన్ని నిరూపించుకోలేక యడ్యూరప్ప రాజీనామా చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుని బీజేపీకి గట్టి బుద్ది చెప్పాయన్నారు. మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న రోజుల్లో బీజేపీ పాలనకు, అరాచకాలకు చరమగీతం పాడతారని అన్నారు. దేశంలో ఓ ప్రజాస్వామయ్య వ్యవస్థను, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసిన భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నేడు సుప్రీం కోర్టు కర్ణాటక రాజకీయ సంక్షోభంలో కీలకంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని చెప్పారు. దేశం, ప్రజలు బాగుండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సైతం తూట్లు పొడిచేలా బీజేపీ వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వారు విమర్శించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఒక్క కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని వారు పిలుపునిచ్చారు. పీసీసీ కార్యదర్శి తమటం వెంకటనరసింహులు మాట్లాడుతూ కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమంగా, అన్యాయంగా అధికారం చేజిక్కించుకోవాలంటే భారతదేశంలో సాధ్యం కాదని బీజేపీకి అర్థమయ్యేలా చేసిందన్నారు. నగర అధ్యక్షుడు పొలకల మల్లిఖార్జున మాట్లాడుతూ కర్ణాటకలో జరుగుతున్న అక్రమాల గురించి వైకాపా అధ్యక్షుడు జగన్ ఒక్కమాట కూడా మాట్లాడక పోవడం గమనిస్తే ఆరెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం అవుతోందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా బీజేపీ అభ్యర్థుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని, ఏపీలో ప్రజలు బీజేపీ, వైకాపాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానిగా తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపుపైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, సుధాకర్, కె.కిరణ్‌రెడ్డి, యార్లపల్లి గోపి, కుమార్, మోహన్ రెడ్డి, తిరుమల సత్యనారాయణ, సావిత్రియాదవ్, సింధూజ, చిట్టిబాబు, నరేంద్ర, రమేష్, అయ్యప్ప, సెల్వా, వడివేలు, దేవ, తేజా తదితరులు పాల్గొన్నారు.