చిత్తూరు

రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 22: రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. మంగళవారం చిత్తూరు-మురకంబట్టు ప్రాంతాల్లో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంద కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని ఇందులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పనులు నాసిరకంగా జరిగితే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. చిత్తూరు-పాకాల మధ్యలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులను ప్రణాళిక బద్దంగా చేపడితే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పనులను బెంగుళూరుకు చెందిన కృషి ఇన్ ప్రోటెక్ సంస్థ చేపడుతున్నట్లు ఈ ఈ శివరాం కలెక్టర్‌కు తెలిపారు. ఈ పనులకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌ను తమకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించడంతో త్వరలోనే అందచేస్తామని ఈ ఈ తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వినాయకుని సేవలో తెలంగాణ శాసనమండలి చైర్మన్
ఐరాల, మే 22: స్వయంభు వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు తెలంగాణా రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.