చిత్తూరు

రాజకీయ లబ్ధి కోసం ఆలయాలను కూడా వేదికగా చేసుకున్న ఘనుడు బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 22: తన రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ స్థాయికైనా తెగబడతారని, నేడు తిరుమల వెంకన్న క్షేత్రంలో చిచ్చు పెట్టిన వైనం మరోమారు నిరూపణ అయిందని, ఇందుకు అర్చకులను పావులుగా వాడుకుని బాబు తప్పు చేస్తున్నారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామికి భగవత్ రామానుజాచార్యుల మార్గదర్శకంలో అర్చకులు ఆలయంలో స్వామివారికి కైంకర్యాలు చేస్తున్నారన్నారు. వీటిని ఉద్యోగంగా కాకుండా వారి జన్మత హక్కుగా కైంకర్యాలు చేస్తూ తరిస్తున్నారన్నారు. నేడు చంద్రబాబునాయుడు తన రాజకీయ లబ్ధికోసం వారి మధ్య ఉన్న చిన్నపాటి అభిప్రాయభేదాలను ఆసరాగా చేసుకుని చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి స్వయంభువుగా వెలిశాడని భక్తకోటి ప్రగాడ విశ్వాసం అన్నారు. అయితే ఆ స్వామి ఎప్పుడు వెలిశారన్నది ఎవరికీ తెలియదన్నారు. భరద్వాజ గోత్రీకులైన గోపీనాథ్ దీక్షితులు, అనువంశీకులుగా ఆగర్భవైష్ణవులుగా స్వామివారికి కైంకర్యాలు చేస్తున్నారన్నారు. 9వ శతాబ్దంలో ఆ భరద్వాజ గోత్రానికి చెందిన వారు రెండు గోత్రాలుగా మార్చుకుని శ్రీనివాస దీక్షితులు వంశీయులుగా ఏర్పాటు చేసుకున్నారన్నారు. భరద్వాజ గోత్రీకులు పైడిపల్లి, గొల్లపల్లి వంశీయులుగాను, కౌశిక గోత్రీకులు తిరుపతమ్మ, పెద్దింటి వంశస్థులుగా వందలు, వేలాది సంవత్సరాలుగా స్వామివారికి కైంకర్యాలు చేసేవారన్నారు. అభయారణ్యంగా తిరుమల క్షేత్రం ఉన్న సమయంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు నిర్భయంగా స్వామివారికి కైంకర్యాలు చేసిన మహానుభావులన్నారు. ఇది ఒక వృత్తిగా కాకుండా భగవత్ సంకల్పంగా భావించి ఈ నాలుగు కుటుంబాల వారు స్వామివారి వైభవాన్ని దశదిశలా వెలుగొందేందుకు కృషి చేశారన్నారు. ముఖ్యంగా స్వామివారికి కైంకర్యాలు ఎంతో నిష్టతో చేస్తూ తిరుమల పవిత్రతకు పట్టం కట్టారన్నారు. కైంకర్యపరులు విష్ణుసాకార స్వరూపులని చెప్పారు. అంటే వేంకటేశ్వరస్వామి ఆలయం లోపల బింబామూర్తిగా అంటే అర్చామూర్తిగాను వెలుపల ఈ అర్చక స్వాములుగాను తిరుమల ఆలయ వ్యవస్థ నడుస్తూ ఉందన్నారు. భగవంతుడు, అర్చకులు కలిసి ఉంటేనే ఈ అర్చక కైంకర్యాలు అన్ని సజావుగా జరుగుతాయని, అప్పుడే వేంకటేశ్వరస్వామి పవిత్రతకు సార్థకత, పరిపూర్ణత చేకూరుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయన్నారు. విష్ణు పురాణం దగ్గర నుండి చాలా స్పష్టంగా ఈ వైఖానస కుటుంబాలకు ముఖ్యంగా ఈ నాలుగు కుటుంబాలకు ఇంత పెద్ద ఎత్తున గౌరవప్రపత్తులు ఇచ్చి, ఆలయం ఇంతగా విరాజిల్లుతోందంటే గొప్ప అర్చక వ్యవస్థ ఉండడమే కారణమన్నారు. ప్రపంచంలోనే ఏ దేవాలయానికీ, ఏ మతానికి సంబంధించినటువంటి వారు కొలిచే ఆలయాలకంటే భిన్నంగా వేంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల క్షేత్రంలో గొల్లసన్నిధి వంశీయులు, తిరుమలనంబి వంశీయులు, అనంతాళ్వార్ల వంశీయులు, తాళ్లపాక వంశీయులు, మహంతులు, తరిగొండ వెంగమాంబకు సంబంధించిన వారు, మైసూరు మహారాజ సంస్థానానికి చెందిన వారందరితోనూ వందల, వేల సంవత్సరాలుగా విరాజిల్లుతున్న ఆలయం తిరుమల క్షేత్రమన్నారు. 11వ శతాబ్ధిలో శ్రీ్భగవద్ రామానుజాచార్యులు భారతదేశం అంతా కూడా సంచరిస్తూ వైష్ణవసంప్రదాయ శిఖరాలను తాకుతూ ఆలయాలను సందర్శించి పాంచరాత్ర పూజా విధానాలను వ్యాప్తి చేశారన్నారు. అదే విధంగా తిరుమల క్షేత్రాన్ని సందర్శించిన రామానుజాచార్యులు అక్కడ జరుగుతున్న వైఖానస పూజావిధానాలను గమనించారన్నారు. వైఖానసమోక్తంగా జరుగుతున్న పూజా విధానాలకు వెన్నుదన్నుగా ఉన్నాడే తప్ప బలవంతంగా పాంచరత్న పూజా విధానాన్ని రుద్దలేదన్నారు. తద్వారా అర్చకవ్యవస్థ గౌరవప్రపత్తులు పెంపొందించారన్నారు. అటు తరువాత చిన్నజీయ్యర్, పెద్దజీయర్‌లు వచ్చి ఆలయంలో నిర్వహిస్తున్న వైఖానస ఆగమ శాస్త్రాలకు చేదోడు, వాదోడుగా ఉన్నారే తప్ప ఎక్కడా పెత్తనం చేయలేదన్నారు. ఇలాంటి ఆచార వ్యవస్థలపై చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. అమరావతిలో బౌద్ద ఆచారాలు నెలకొల్పాలని యోచిస్తున్న చంద్రబాబునాయుడు హిందూ ఆచారాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిస్థితులపై రమణదీక్షితులు వ్యక్తం చేసిన అనుమానాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తద్వారా పోటులో ఏదో జరిగిందన్న అనుమానాలను భక్తులకు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అలాంటి ప్రయత్నం చేయకుండా నాలుగు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. బాబు మాయలో పడి అర్చకులు తమ స్థాయిని దిగజార్చుకునేలా విభేదాలు పెంచుకోవడం బాధాకరమన్నారు. అర్చకుల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు చలికాచుకుంటున్నారని విమర్శించారు. అర్చకుల మధ్య ఉన్న చిన్నచిన్న అభిప్రాయభేదాలు బాబు తన రాజకీయ స్వలాభాలకు వాడుకుంటున్నారన్నారు. ఆగమ ఆచార వ్యవహారాల్లోను, గులాబీ రంగు వజ్రం జెనీవాలో అమ్ముడు అయిందని రమణదీక్షితులు వ్యక్తం చేసిన అనుమానాలను సీబీఐతో విచారణ జరిపించాలని, అధికారులు, రమణదీక్షితులు తప్పు చేశారనే అనుమానం సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అర్చకులతో రాజకీయం చేయడం మహాపాపమన్నారు. జీయ్యర్ వ్యవస్థను, అర్చకులను ప్రభుత్వం అధికారులు బెదిరించి వారిచేత తమకు సానుకూల ప్రకటనలు చేయించడం దురదృష్టకరమన్నారు. తిరుమల గిరులతో చంద్రబాబు రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నారన్నారు. టీటీడీ పాలకమండలి పాపాల మండలిగా మార్చి రెండువేల సంవత్సరాల నాటి ఆచార వ్యవహారాలను టీడీపీ ప్రభుత్వం హరించి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు భక్తకోటికి, అర్చక వ్యవస్థకు, బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలన్నారు. వైకాపా అధికారంలోనికి వస్తే బాబు చేసి అరాచకాలకు స్వస్థి పలికించి వారికి గౌరవం కల్పిస్తామన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైకాపా నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ముద్రనారాయణ, రాజేంద్ర, హనుమంతప్పనాయక్, చెలికం కుసుమ తదితరులు పాల్గొన్నారు.