చిత్తూరు

తిరుమలలో తాత్కాలికంగా సమయ నిర్దేశిత దర్శనం కౌంటర్ల మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 22: శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ సమయం కంపార్టుమెంట్‌లో, క్యూలైన్లలో నిరీక్షించకుండా ఉండాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత దర్శనం కౌంటర్లను అధిక రద్దీ కారణంగా తిరుమలలో తాత్కాలికంగా మూసివేస్తున్నామని, పునఃసమీక్షించిన అనంతరం తిరిగి తెరిచే తేదీని తెలియజేస్తామని, అయితే తిరుపతిలో యథావిధిగా ఈ టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారుల సమావేశం అనంతరం జేఈఓ విలేఖర్లతో మాట్లాడారు. వేసవి సెలవులు కావడం, పోటీ పరీక్షల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో మొక్కులు తీర్చుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు సకాలంలో క్యూలైన్ల వద్దకు వెళ్లలేకపోవడంతో అలాంటి వారికి దర్శన సమయం ఎక్కువ పడుతోందన్నారు. ఒక స్లాట్‌లో ఇచ్చిన భక్తులు ఆలస్యంగా వస్తున్న భక్తులు ఒకేసారి రావడంతో దర్శనానికి మరింత ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ సమయం కంపార్టుమెంట్‌లో గానీ, క్యూలైన్లలో గానీ నిరీక్షించకుండా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ 28న ప్రయోగాత్మకంగా సర్వదర్శనానికి టోకెన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామన్నారు. మే 3 నుండి అధికారికంగా ప్రారంభించామన్నారు. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 28 నుండి మే 21వతేదీ వరకు 5,43,308 మంది భక్తులు సమయ నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందారని, అయితే 4,02,011మంది మాత్రమే ఈ టోకెన్ల ద్వారా దర్శనానికి వచ్చారన్నారు. ఇందులో 24శాతం మంది భక్తులు గైర్హాజయ్యారని వివరించారు. 17వతేదీ గురువారం 25,239 మంది టోకెన్లు పొందగా, 17,983మంది మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 18వతేదీ 35,346మంది టోకెన్లు పొందగా, 25,942మంది దర్శించుకున్నారని, 19వతేదీ 49,009మంది టోకెన్లు పొందగా, 37,318మంది మాత్రమే దర్శించుకున్నారని తెలిపారు. 20వతేదీ ఆదివారం 44,576మంది టోకెన్లు పొందగా, 33,268మంది, 21వతేదీ సోమవారం 32,997మంది టోకెన్లు పొందగా, 22,774మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు 7శాతం, 300రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన భక్తులు 7శాతం గైర్హాజరవుతున్నారన్నారు. తిరుమలలో మూడింట రెండొంతుల మంది, తిరుపతిలో మూడింట ఒక వంతు మంది సమయ నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందుతున్నారన్నారు. దర్శన సమయం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. సమయ నిర్దేశిత దర్శనం టోకెన్ల విధానానికి సామాన్య భక్తులు ఎంతగానో సహకరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో సమయ నిర్దేశిత దర్శన టోకెన్లు పొందడం ద్వారా ప్రణాళికాబద్దంగా తిరుమల యాత్ర సాగించవచ్చునని జేఈఓ సూచించారు. లేపాక్షి సర్కిల్ నుండి సర్వదర్శనం భక్తుల క్యూలైన్ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామని, దీనిపై రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం ప్రకటించి భక్తులకు అవగాహన కల్పిస్తామని జేఈఓ పేర్కొన్నారు. అధికారుల సమావేశంలో టీటీడీ ఎఫ్‌ఎ అండ్ సీఏఓ బాలాజీ, ఎస్‌ఈలు రామచంద్రారెడ్డి, రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, వీఎస్‌ఓ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అలిపిరి దాడి కుట్రపూరితమైంది
* దోషులను అరెస్ట్ చేయాలి * బీజేపీ డిమాండ్
తిరుపతి, మే 22: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో అలిపిరి వద్ద ఆయన వాహనశ్రేణిపై జరిగిన దాడి టీడీపీ ఒక కుట్రపూరితమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రముఖ న్యాయవాది సామంచి శ్రీనివాస్, జాతీయ నాయకులు శాంతారెడ్డి, కోలా ఆనంద్ ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జడ్ కేటగిరి హోదా కలిగిన తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. అదే సమయంలో టీడీపీ నాయకులు ఒక పథకం ప్రకారం అలిపిరి వద్ద కాపుకాసి కర్రలతో, రాళ్లతో దాడికి తెగబడ్డారన్నారు. ఈ అంశంలో పోలీసులు కూడా టీడీపీ నేతలతో చేతులు కలిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ సంఘటన వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారని ఆరోపించారు. ఆయన ఆదేశంతోనే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తే, టీడీపీ నేతలు రౌడీ మూకల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపైన కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే తాము బెదిరే ప్రసక్తే లేదన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో నగర అధ్యక్షులు వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, సుబ్రమణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.