చిత్తూరు

హనుమంత, గజ వాహనాలపై ఊరేగిన గోవిందరాజ స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హనుమంత వాహనంపైన, రాత్రి గజ వాహనంపైన గోవిందరాజ స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.త్రేతాయుగంలో రామ భక్తనిగా ప్రసిద్ధి గాంచిన వాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడు తన పరమ భక్తుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాఢ్యాలు హనుమంతుని తలిస్తే లభిస్తాయి. అందువల్ల శ్రీరాముని ప్రతి రూపమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో హనుమంతుడు వాహనంగా మారడం ఉపపన్నమే. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. వాహనసేవ అనంతరం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 5 నుంచి 6గంటల మధ్య శ్రీవారి బంగారు తిరుచ్చిపై నాలుగ మాడ వీధుల్లో ఊరేగారు.
గజవాహనంపై గోవిందుడి విహారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు నాలుగు మాడా వీధుల్లో గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనంగా గజ వాహనం కావడంతో సర్వాలంకార భూషితుడై కదలివచ్చిన స్వామికి భక్తులు అడుగడుగునా కర్పూర నీరజనాలు సమర్పించుకుని తన్మయులైయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్, టీటీడీత స్థానిక ఆలయాల డిప్యూటి ఈ ఓ వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి ఉదయభాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్ ఇతర అధికారులు, పెద్ద సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మత్సవాల సందర్భంగా శనివారం తిరుతపిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే మంగళధ్వని, 6.30 నుంచి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన కె. ఇందిర బృందం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు జి.మధుసూధన్‌రావు బృందంచే భక్తి సంగీతం నిర్వహించారు. గోవిందరాజ స్వామి పుష్కరణి వద్ద 6.30 నుంచి 7.30 గంటల వరకు జె.కృష్ణకుమారి బృందంచే భక్తి సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయం త్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు గుంటూరుకు చెందిన బుర్ర పద్మనాభశర్మచే హరికథ పారాయణం జరిగింది.

విష్ణునివాసంలో కార్మికుల ధర్నా
* పద్మావతి కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్
తిరుపతి, మే 26: టీటీడీ నిబంధనల ప్రకారం విష్ణునివాసం, మాధవంలో పనిచేస్తున్న కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం సిఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు విష్ణునివాసంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ 55 సంవత్సరాలు పైబడిన వారిని, డిగ్రీ విద్యార్హత లేని సూపర్‌వైజర్స్‌ను పద్మావతి కంపినీ తొలగించాలని నిర్ణయించడం దారుణమన్నారు. టీటీడీ ఒప్పందంలో కార్మికులను 60 సంవత్సరాల వరకు పనిచేయడానికి అర్హత ఉందని చెప్పారు. 10 విద్యార్హత ఉన్నవారిని సూపర్ వైజర్‌గా కొనసాగవచ్చని పొందుపరిచారని తెలిపారు.
అయితే పద్మావతి కంపెనీకి చెందిన భాస్కర్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటూ కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నాడన్నారు. టీటీడీ నిబంధనలను కాదని ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ కార్మికులకు, భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న పద్మావతి కంపెనీ అగడాలను కార్మికులు తిప్పి కొట్టాలన్నారు. వెంటనే ఈ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఆర్.లక్ష్మి, పి.బుజ్జి, ఎన్.గురుప్రసాద్ కార్మికులు పాల్గొన్నారు.