క్రైమ్/లీగల్

మహిళా న్యాయవాది హత్యకేసులో.. ఆరుగురు కిరాయి హంతకులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 12: మదనపల్లె పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది హత్యకేసులో ఆరుగురు కిరాయి హంతకులను అరెస్టుచేసినట్లు మదనపల్లె డిఎస్‌పి చిదానందరెడ్డి వెల్లడించారు. ఈనెల 2న ప్రదాన నిందితుడు ప్రముఖ న్యాయవాది, భర్త కె.జితేంద్ర(49)ని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్‌పి తెలిపారు. స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్‌పి చిదానందరెడ్డి మాట్లాడారు. మదనపల్లె మండలం పెంచుపాడుకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి కె.ఎస్.జానకీరామ్ కుమారుడు కె.జితేంద్ర మదనపల్లెలో చదువుకుని న్యాయవాధిగా జీవనం సాగించేవాడు. గుర్రంకొండ మండలం తరిగొండ పంచాయతీకి చెందిన రామచంద్రరావు, సుబ్బరత్నమ్మ చిన్న కుమార్తె గుమ్మల నాగజ్యోతికి 25 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త జితేంద్ర న్యాయవాదిగా జీవనం సాగిస్తుండగా, భర్త న్యాయవృత్తిలో భార్య నాగజ్యోతి చేదోడువాదోడుగా ఉండేది. న్యాయవృత్తిపై ఆసక్తి కలగడంతో భర్త జితేంద్ర భార్యను చదివించి 2004లో న్యాయవాదిగా విధుల్లో చేర్పించారు. ఇద్దరు న్యాయవృత్తిలో కొనసాగుతున్న వీరికి కుమార్తె జయనిఖిత, కుమారుడు అభిషేక్ సంతానం. వీరి మధ్య చిన్న ఆర్థిక లావాదేవీలు ఏర్పడటంతో పలుమార్లు నాగజ్యోతి అలిగి అమ్మగారింటికి వెళ్లిపోయేది. పలుమార్లు పెద్దమనుషుల పంచాయతీతో ఇద్దరు సర్ధుకునేవారు. రెండేళ్లక్రితం నుంచి నాగజ్యోతి భర్తకు దూరంగా పుట్టినింట్లో ఉంటోంది. అమ్మనాన్న చనిపోవడంతో అమ్మినేనివీధిలోని ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆర్నెళ్లక్రితం కుమర్తె వివాహం జరిగింది. భార్యభర్తలు ఇద్దరు కోర్టులో పలుమార్లు ఎదురుపడినపుడు ఒకరికొకరు దూషించుకునే వారు. నాగజ్యోతి భర్త జితేంద్రపై మదనపల్లె వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అది అవమానంగా భావించిన జితేంద్ర కక్ష పెంచుకున్నారు. కుమార్తె వివాహానికి సైతం భార్య నాగజ్యోతి దూరంగా ఉంది. ఏలాగైన భార్య నాగజ్యోతిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భర్త న్యాయవాది జితేంద్ర, మహేష్(27) పాతనేరస్తులకు హత్యచేయమని పీలేరుకు చెందిన పాతకేసులలో ముద్దాయి హనుమంతు(23), రెడ్డిశేఖర్‌నాయక్(23)లకు రూ.2లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సబ్‌జైల్‌లో ఏర్పడిన పరిచయం ద్వారా ఇదివరకే దొంగతనం, హత్యాయత్నం కేసులలో ముద్ధాయిలుగా ఉన్న సద్ధాంహుసేన్(23), అస్లాంబాష(25), తన్వీర్(20)లకు రూ.20లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని రూ.1.20లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. గతనెల 28, 29వ తేది కోర్టు ఆవరణలోని గంగమ్మగుడి సమీపంలో హత్యచేయడానికి మహిళ న్యాయవాది నాగజ్యోతి కోసం ఎదురుచూశారు. మహిళా న్యాయవాది జ్యోతి ఆ దారిన కోర్టుకు రాలేదు. తర్వాత నలుగురు వ్యక్తులు ఆమెను వెంబండించి కాపుకాశారు. చివరకు గతనెల 30న మధ్యాహ్నం నుంచి న్యాయవాది నాగజ్యోతిని వెంబడించి మూడు గంటల ప్రాంతంలో బ్యాంకర్స్‌కాలనీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరింది. కాపుకాచిన మార్గంలో నాగజ్యోతి ద్విచక్రవాహనంలో రావడం, ఆమెను నడిరోడ్డుపై సద్దాంహుసేన్, అస్లాంబాష అడ్డగించి, మొదట తన్వీర్ అరటిగెల కోసే కత్తితో వెనుకనుంచి గొంతుకోయగా, అస్లాంబాష మరోకత్తితో గొంతుకోసి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆరుగురు నిందితులు పట్టణ శివారుప్రాంతం అమ్మచెరువుమిట్ట చేనేతనగర్ ప్రాంతంలో అరెస్టుచేసి, వారి వద్దనుంచి రక్తపు మడుగులతో ఉన్న అరటిగెల కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి చిదానందరెడ్డి వెల్లడించారు. సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది కేసును చేధించిన మదనపల్లె రెండో పట్టణ సిఐ సురేష్, పోలీస్‌సిబ్బందిని డిఎస్‌పి చిదానందరెడ్డి, ఎస్‌పి రాజశేఖర్‌బాబు అభినందించారు. ఈసందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ ప్రతినెలా పోలీస్ సబ్‌డివిజన్‌లోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, మరో ఆరుగురిపై పిడి యాక్టు నమోదు చేస్తున్నట్లు డిఎస్‌పి వెల్లడించారు. హత్యలను ప్రోత్సహించే వారిపై ఎప్పటికప్పుడు నిఘా వేశారని, ప్రధానంగా రౌడీషీటర్లపై నిఘా వేయడంతోపాటు వారికి జియోట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో మదనపల్లె టూటౌన్ సిఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐలు ఉన్నారు.

తిరుమల కాలిబాటలోని బాత్‌రూమ్‌లో వృద్ధుని మృతదేహం
తిరుపతి, జూన్ 12: తిరుమల మొదటిఘాట్ రోడ్డులో 41వ మలుపు వద్ద మోకాళ్లమెట్ల ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన బాత్‌రూములో 71 సంవత్సరాలు వయస్సున్న గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది పడివుండగా గుర్తించారు. బాత్‌రూమ్‌లో మృతి చెంది వున్న వృద్ధుడిని తోటి భక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వృద్ధుడు గుండెపోటుతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.