చిత్తూరు

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల రూపకల్పనలో అందరు భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 16: తిరుపతి పుణ్యక్షేత్రాన్ని స్మార్ట్‌సిటీగా రూపొందించడంలో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టుల రూపకల్పనలో నగర ప్రజలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. శనివారం సాయంత్రం తిరుపతి స్మార్ట్‌సిటీ అంతర్గత సమావేశం స్థానిక తుడా సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల రూపకల్పన వినూత్నంగా ఉండాలన్నారు. ఇందుకు అందరిని భాగస్వాములు చేయాలన్నారు. స్థానిక ప్రజలకు, యాత్రికులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చేయాలన్నదే ఉద్దేశ్యమన్నారు. ఇప్పటికే ఐఐటీ చెన్నై వారు రూపొందించిన స్మార్ట్ ఎలివేటర్ క్యారిడార్‌పై రైల్వే, ఆర్టీసీ అధికారులతో సమావేశం అయ్యామన్నారు. వారి వారి పరిధిలో ఏవైనా పదిరోజుల్లోపు సవరణలు సూచించాలని తెలిపారు. పీబీఎస్ పబ్లిక్ బైక్ చేజింగ్ విధానం, సైకిళ్లను అందుబాటులోనికి తెస్తున్నామన్నారు. యాత్రికులకు, నగర ప్రజలకు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఎలా ఉపయోగంగా ఉంటుందోనని నివేదిక తయారు చేయాలని విశ్వవిద్యాలయ ప్రతినిధులకు సూచించారు. నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ సైకిళ్లను అందుబాటులోనికి తెస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా విశ్వవిద్యాలయాల్లో మోటార్ సైకిళ్లు అనుమతి లేకుండా పీబీఎస్ సైకిళ్లను అందుబాటులోనికి తీసుకురావాలని చెప్పారు. స్పోర్ట్ కాంప్లెక్స్ నగర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. చిన్న పిల్లల నుండి, పెద్ద పిల్లల వరకు అన్ని రకాల స్పోర్ట్స్ గేమ్స్, పుట్‌బాల్, టెన్నీస్ వంటివి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి విశ్వవిద్యాలయాలు స్థలం ఇవ్వగలిగితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇక వినాయకసాగర్, ఇస్కాన్, ప్లాంటింగ్ సోలార్ ఏర్పాటు, వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో యాప్‌ను అందుబాటులోనికి తీసుకురావాలని, ఏఈ , డెలాయిట్ సంస్థలకు సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, జేసీ గిరీషా, ఎస్వీయు వీసీ దామోదరం, మహిళా వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఉమ, తుడా కార్యదర్శి మాధవీలత, తుడా, రైల్వే, ఆర్టీసీ, ఏఈ , డెలాయిట్ సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు.