చిత్తూరు

విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధరనెల్లూరు, జూన్ 17: మండలంలోని మహదేవమంగళంలో విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలికొంది. వివరాలిలా ఉన్నాయి. మహదేవమంగళం గ్రామానికి చెందిన సెల్వం ఆచారి కుమారుడు సుమంత్(7) శనివారం గ్రామంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సంతోష్ ఆడుకుంటూ బహిర్భూమి కోసం స్థానిక ట్రాన్స్ ఫార్మర్ సమీపంలోకి వెళ్లాడు. విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ఓ వైరు నుంచి విద్యుత్ ప్రవహించింది. దీనిని గమనించని బాలుడు కేబుళ్లను పట్టుకోవడంతో తీవ్ర విద్యుద్ఘాతానికి లోనై అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తరువాత గమనించిన గ్రామస్తులు సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేశారు. తదుపరి విద్యుత్ కట్ చేసి పరిశీలించే లోపే బాలుడు మృతి చెందాడు. విద్యుత్‌శాఖ అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో తమ బిడ్డ మరణించాడని అతని కుటుంబ సభ్యులు వాపోయారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కాలుష్య నివారణ మానవ మనుగడకు సంజీవిని
* డాక్టర్ ఆశాలత సూచన
రేణిగుంట, జూన్ 17: సంపద ఎంత ఉన్నా మనిషి ఆరోగ్యంగా లేకపోతే వాటి ఫలితం శూన్యమని, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అవసరమని ఆషారాయ ఫౌండేషన్ అధ్యక్షురాలు, టీడీపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ రాయ ఆశాలత సూచించారు. ఆదివారం రేణిగుంట విమానాశ్రయం వద్ద పచ్చదనం-పర్యావరణం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాయ ఆశాలత ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణ కాలుష్యం అతి పెద్ద ముప్పుగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు కారణం మానవ జాతికి, సర్వ జీవకోటికి అవసరమైన ఆక్సిజన్ అందించే చెట్లు కనుమరుగు అవుతుండటమేనన్నారు. భగవంతుడు భూమిపై సర్వ జీవరాశులకు అవసరమైన ప్రకృతిని సృష్టించాడన్నారు. మానవ తప్పిదాలతో ప్రకృతి వనరులు కనుమరుగు అవుతున్నాయన్నారు. ఇందులో అతి ప్రధానమైనది వృక్ష సంపద అన్నారు. వృక్షాలను సంరక్షించుకోవడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి సాధ్యం అవుతుందన్నారు. అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఇక పర్యావరణ కాలుష్యానికి మరో ప్రమాదంగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు విడనాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ జీఎం మనీష్, అర్చనదేవీ, గీతదేవీ తదితరులు పాల్గొన్నారు.