చిత్తూరు

టీటీడీలో హక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: టీటీడీలో హక్కుల ఉల్లంఘన, కాంట్రాక్ట్ వ్యవస్థ పెచ్చుమీరిపోయిందని పలువురు కార్మిక, ప్రజా సంఘాలు, టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా సోమవారం టీటీడీ పరిపాలనా భవనం ముందు సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యశోదనగర్‌లోని ఎం.బి.్భవన్‌లో టీటీడీలో హక్కుల ఉల్లంఘన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎల్.రత్నకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.పుల్లయ్య, టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు జి.వెంకటేష్, రత్న ప్రభాకర్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జాతీయ సెలవుదినాలతోపాటు అన్ని ప్రభుత్వ సెలవుదినాలను వేతనంతో కూడిన సెలవుదినాలుగా పరిగణించాలని, 8గంటలు మించి పనిచేస్తున్న వారికి ఓవర్ టైం అలవెన్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఇఎస్‌ఐ, పీఎఫ్, గ్రాట్యుటీని అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలకు నెలకు ఒక్కసారైన శ్రీవారి దర్శనం కల్పించాలన్నారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, టీటీడీలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, ఏళ్ల తరబడి పనచేస్తున్న కార్మికులందరి పేర్లు ఇతర వివరాలు కంప్యూటరీకరించి, వారి సర్వీసులను నమోదు చేయాలని, సర్వీసు ఆధారంగా వేతనాలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ, కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో హక్కుల ఉల్లంఘన నిరసిస్తూ, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ టీటీడీ ఉద్యోగ, కార్మిక సంఘాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం వద్ద ప్రముఖులు సంతకాలు సేకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగ, కార్మికులకు సంఘీభావంగా రౌండ్ టేబుల్ సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా రిటైర్డ్ జడ్జి పెనుమూరు గుర్రప్ప, ప్రధాన కార్యదర్శిగా ఎస్.మునిరాజా, గౌరవ సలహాదారుగా ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్, కమిటీ సభ్యులుగా ఐఎన్‌టీయూసీకి చెందిన రత్నకుమార్, ఏఐటీయూసీకి చెందిన మురళి, సీఐటీయూకి చెందిన జి.బాలసుబ్రమణ్యం, టీటీడీ యూనియన్ నాయకులు జి.వెంకటేష్, రత్నప్రభాకర్, ఎం.నాగార్జున, వెంకట్రామిరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు జి.బాలసుబ్రమణ్యం, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, శ్రామిక మహిళా నేతలు వాణీశ్రీ, నాగరాణి, ఆర్.లక్ష్మి, సుజాతమ్మ, టీటీడీ సంఘాల నేతలు గుణశేఖర్, రత్నప్రభాకర్, ఎస్వీబీసీకి చెందిన వరదరాజులు, పురాణపండితులు రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.