చిత్తూరు

సంస్కృత భాషకే తలమానికం పతంజలి యోగశాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 21: మానవజాతి మొత్తానికి ఆది వ్యాధులను ప్రారద్రోలడానికి 3వేల సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని, అష్టాంగయోగ సారాన్ని సంస్కృత భాషలో అందరికీ అర్థమయ్యేలా అందించారని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ చాన్సలర్ ఆచార్య మురళీధర శర్మ వెల్లడించారు. విద్యాపీఠంలో గురువారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ అవగాహన ర్యాలీని నిర్వహించారు. పంతజలి మహర్షి చిత్రపటానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు యోగ ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యోగః చిత్తవృత్తి నిరోధకః అని అతి సులువైన పదాలతో సంస్కృతంలో ప్రజలకు అందించారని చెప్పారు. యోగాధ్యయనంతో పలురకాల ఆసనాలతో వివిధ రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చని చెప్పారు. యోగ సర్వ వ్యాధి నివారిణి అన్నారు. 2018-19 సంవత్సరం నుంచి బీఎస్సీ, ఎమ్మెస్సీ యోగా థెరపీ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ పతంజలి అందించిన యోగ శాస్త్రం మానవులకు కల్పవృక్షం లాంటిదని, ఆ మహర్షికి మానవజాతి మొత్తం రుణపడి ఉందన్నారు. విద్యాపీఠం రిజిస్ట్రార్ ఆచార్య సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రస్తుతం పాశ్చాత్య దేశాలు యోగా మార్గాన్ని అనుసరిస్తూ భారతదేశానికి సాగిలపడి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగాథెరపిస్ట్ డాక్టర్ రాజేంద్రరెడ్డి, పిఆర్వో డాక్టర్ ఎస్.దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

పట్టణ పేదల కుటుంబ ఆదాయం పెంపు లక్ష్యంగా రుణాలు మంజూరు
* మెప్మా పీడీ జ్యోతి వెల్లడి
తిరుపతి, జూన్ 21: పేద కుటుంబాల నెలసరి ఆదాయం పదివేల రూపాయల లక్ష్యంగా మెప్మా ఎంఈసీసీలు రుణాలు అందించాలని మెప్మా పీడీ జ్యోతి ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక బైరాగిపట్టెడలోని మెప్మా కార్యాలయంలో మైక్రో ఎంటర్‌ప్రెన్యుర్ కమ్యూనిటీ కన్సల్టెంట్స్ సమావేశం ఏర్పాటు చేసి పథకాల అమలు సమీక్షాంచారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ అర్హత గల వెనకుబడిన తరగతుల కులవృత్తుల వారికి ఆదరణ2 పథకం అందించడానికి నమోదు చేపట్టాలన్నారు. జిల్లాలో 19,453యూనిట్లు లక్ష్యంగా ఉందన్నారు. ప్రతి కుటుంబం ఆదాయం నెలకు పదివేలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించిందని, ఆ మేరకు రుణాలు పంపిణీ చేపట్టాలన్నారు. ఆదరణ2 పథకంలో మెప్మా ఎంఈసీసీలు 600మంది అర్హతగల లబ్ధిదారులను నమోదు చేయించాలన్నారు. ఎస్‌హెచ్‌జీలకు ఎస్‌బీజీలకు ముద్ర రుణాలు ఇప్పించాలని సూచించారు. పట్టణ జీవనోపాధుల కేంద్రంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, గృహ అవసరాల వృత్తి పనివారు అందుబాటులో ఉంటారని, నివాసాల నుండి కాల్ వచ్చిన వెంటనే ఆ ఇంట్లో కావాల్సిన వైరింగ్, ఏసీ, ప్యాన్లు రిపేరు, ప్లంబింగ్ పనులు వంటివి తక్కువ ఖర్చుతో అందుబాటులోనికి రానుందన్నారు. ఇందుకోసం మెకానిక్స్‌ను నమోదు చేసుకుని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, త్వరలో అందుబాటులోనికి తీసుకురానున్నామన్నారు. జనరిక్ మందుల నిర్వహణ వంటివి పేదలకు అవగాహన కల్పించడం వంటివి చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో మెప్మా సిబ్బంది గోపి, కాటమరాజు, మహేష్, ఎంఈసీసీలు పాల్గొన్నారు.