చిత్తూరు

తిరుపతి, మదనపల్లిల్లో బ్రాహ్మణ సొసైటీ బ్రాంచీల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 21: పేద, మధ్య తరగతి బ్రాహ్మణులకు తక్కువ వడ్డీలతో రుణాలు మంజూరు చేసేందుకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టిసారించిందని, ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లిల్లో నూతన బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కో ఆర్డినేటర్, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు చిత్రపు హనుమంతరావు వెల్లడించారు. గురువారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ పేద బ్రాహ్మణులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015 డిసెంబర్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పేద బ్రాహ్మణులకు 216కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి 46,789మంది బ్రాహ్మణ కుటుంబాలకు 62కోట్లతో లబ్ధి చేకూర్చామన్నారు. చిత్తూరు జిల్లాలో 201516 సంవత్సరంలో 12లక్షలతో 431మందికి, 1617లో సుమారు 2.50కోట్లతో 1,113మందికి, 1718లో 2.74కోట్లతో 1526మందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు చేయూతనివ్వడంలో కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్‌సూర్య కృషి ఎంతో ఉందన్నారు. భారతి విదేశీ విద్యాపథకం ద్వారా మదనపల్లికి చెందిన శ్రీకర్, తిరుపతికి చెందిన ప్రణవాదిత్య, కృష్ణారావు, శ్రీకాళహస్తికి చెందిన చిరంజీవి ఐదుమంది విద్యార్థులకు విదేశీ విద్యాపథకం కింద ఒక్కొక్కరికి 15లక్షల రూపాయలు అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌ను 40కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సొసైటీ చైర్మన్ ఎంబీఎస్ శర్మ, వైస్ చైర్మన్ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి నేతృత్వంలో రాష్టవ్య్రాప్తంగా 30వేల మంది సభ్యులతో ఆరు బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజంపేట, విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, నెల్లూరులో ఉన్నాయన్నారు. ఈనెల 30న మదనపల్లిలోను, జూలై 9న తిరుపతిలో అదనంగా మరో రెండు బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక బ్రాంచి ఏర్పాటు చేస్తారని, అయితే మదనపల్లి, తిరుపతిలో ఎక్కువ మంది సభ్యత్వం కలిగి ఉండడంతో రెండు బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 3500మంది సభ్యులకు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి 72గ్రూపులకు 32లక్షల రూపాయలు లబ్ధిదారులకు తక్కువ వడ్డీతో సులభ వాయిదా పద్ధతుల్లో అందజేశామన్నారు.
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు చేసుకోండి
పేద బ్రాహ్మణ విద్యార్థులు వివిధ పథకాల రూపొందించిన స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చిత్రపు హనుమంతరావు కోరారు. గాయత్రి విద్యా ప్రశస్త పథకం ద్వారా 10వ తరగతి నుండి పీజీ వరకు ఆయా పాఠశాల, కళాశాల, యూనివర్శిటీల్లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు పారితోషికం అందిస్తారన్నారు. దీనికి ఆదాయ పరిమితి లేదన్నారు. 18.6.2018 నుండి 21.7.2018లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. భారతి విద్యాపథకం ద్వారా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, సీఎ విద్యార్థులు మూడులక్షల లోపు ఆదాయం కలిగి ఉన్న వారు అర్హులన్నారు. వీరు 18.6.18 నుండి 31.7.2018లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ నుండి పీజీ కొరకు 1.8.18 నుండి 30.9.18లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విదేశీ విద్యకొరకు 6లక్షల రూపాయలు లోపు ఆదాయం కలిగిన విద్యార్థులు అర్హులు. వీరు 1.7.2018 నుండి 31.8.2018లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేద విద్య అభ్యసించేందుకు 1.7.18 నుండి 31.8.2018లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ద్రోణాచార్య నైపుణ్య శిక్షణా పథంలో బి.కామ్, ఎం.కామ్, ఎంబీఎ, సీఎ, ఐసీడబ్ల్యుఎ చదివిన విద్యార్థులు శిక్షణ పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. వీరు 15.6.2018 నుండి 30.6.2018లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థులు మేము తెలిపిన తేదీల్లో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్ట్ఫికేట్లు ఆన్‌లైన్‌లో పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. ఆంధ్రబ్రాహ్మిణ్.ఆర్గ్, 8666650345, 9440066267ను సంప్రదించాలని కోరారు.