చిత్తూరు

జూబ్లీహిల్స్‌లో ఆలయ నిర్మాణానికి రూ.5కోట్లు టీటీడీ ఇవ్వడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23: జూబ్లీహిల్స్‌లోని సీతారాముల వారి ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ. 5కోట్లు ఇవ్వడం తగదని వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లాప్రధాన కార్యదర్శి కందారపు మురళీ శనివారం ఒక ప్రకటనలో టీటీడీని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి నిత్యం వెళ్లే ఈ ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.4.70 కోట్లు కేటాయించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేరుతో జీఓనే విడుదల చేయడం దారుణమన్నారు. సీ ఎం ఆదేశాలతో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు టీటీడీ ఆధ్వర్యంలోలేని ప్రైవేట్ ఆలయానికి ఆన్‌లైన్లో టెండర్లు పిలవడం సరికాదన్నారు. టీటీడీలో పనిచేస్తున్న 13వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని, వర్క్ కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని సీఐటీయూ మొత్తుకుంటున్నా టీటీడీ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. స్వామివారి నిధులను వృథా చేయకుండా తిరుపతి, తిరుమలలో సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు, భక్తుల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి అందులోను పొదుపు చేయాలని చూస్తున్న టీటీడీకి భక్తులు, కార్మికుల సమస్యలు అర్థంకావడం లేదని అన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందని పదే పదే చెబుతున్న ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రైవేట్ ఆలయానికి నిధులు కేటాయించడంపై సమాధానం చెప్పాలని మురళీ డిమాండ్ చేశారు.

లయన్స్‌క్లబ్ తిరుపతి గ్రేటర్ సహాయం
తిరుపతి, జూన్ 23: లయన్స్‌క్లబ్ తిరుపతి గ్రేటర్ అధ్యక్షుడు డాక్టర్ ఈ.బాలాజీ ఆధ్వర్యంలో శనివారం ఇద్దరు నిరుద్యోగ యువకులకు వెల్డింగ్ మిషన్, కటింగ్, డ్రిల్లింగ్ మిషన్‌ను ఉచితంగా అందించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఉదయం విలేఖరుల సమక్షంలో వారికి అందించారు. అలాగే సేవ అనే సంస్థకు రూ. 20వేలు చెక్కును ఆ సంస్థ ప్రతినిధికి అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మధుమేహం పరీక్షలు ఉచితంగా చేస్తామని, అలాగే అత్యవసర వైద్యంపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఈకార్యక్రమంలో లయన్స్‌క్లబ్ గ్రేటర్ తిరుపతి కోశాధికారి డాక్టర్ డి. ఎన్.రెడ్డి, డాక్టర్ జి.గంగిరెడ్డి, డాక్టర్ బీవీ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.