చిత్తూరు

జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 23: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదంతో రచ్చరచ్చగా కొనసాగింది. సమావేశం ప్రారంభం నుంచి టీడీపీ వైకాపా సభ్యుల ఆరోపణలు విమర్శలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జడ్పీ సమావేశంలో 45 అంశాలపై చర్చించాలని అజెండా పొందుపరిచినా కేవలం తొమ్మది అంశాలతోనే సరిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పలు మార్లు అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాగ్వివాదాలు కొట్టుకొనే స్థాయికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. శనివారం జడ్పీ చైర్‌పర్స్‌న్ గీర్వాణి చంద్రప్రకాష్ అధ్యక్షతన చిత్తూరు అంబేద్కర్ భవన్‌లోజిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి అమరనాథ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే వైకాపా నేత వెంకటరెడ్డి యాదవ్ ప్రస్తుతం జిల్లాలో ప్రధాన సమస్య మామిడికి గిట్టుబాటు ధరలు లేక పోవడమేనని దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. పలువురు టీడీపీ సభ్యులు సభను అజెండా ప్రకారం కొనసాగించాలని పట్టు పట్టడంతో సభలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకొంది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో జీఎస్టీతో అనేక సమస్యలు వస్తున్నాయని దీనిపై గతంలో కూడా ప్రస్తావించినా ప్రయోజనం లేక పోయిందని, జీఎస్టీతో పనుల చేయలేని పరిస్థితి నెలకొందని దీనిపై ఒక నిర్ణయానికి రావాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రి అమరనాథ్‌రెడ్డి జోక్యం చేసుకోని ఈవిషయం ఇక్కడ పరిష్కారమయ్యేది కాదని కేంద్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు తెరిచినా ఇంత వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేని, పాఠశాలల్లో భోజనం చేసే కార్మికులకు బిల్లులు ఇంత వరకు అందలేని, స్కావేంజర్స్‌కు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, పాఠశాలలపై పర్యవేక్షణ కరవైందని ఆరోపించారు. జిల్లాలో ఇషా విద్యావిధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి జోక్యం చేసుకొని మరోవారం రోజుల వ్వవధిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేస్తామని, జిల్లాలో ఇషా విద్యావిధానం ఈ ఏడాది వరకు కొనసాగుతుందన్నారు. మదనపల్లి వైకాపా ఎమ్మెల్యే తిప్పారెడ్డి వైకాపా సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో పలు ఆదర్శ పాఠశాలల్లో సీట్లసంఖ్య పెంచినా అక్కడ అధికారులు విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా వసతులు లేవని కారణంగా విద్యార్థులను చేర్చుకోవడం లేదని సభలో ప్రస్తావించారు. . దీంతో డీఈవో జోక్యం చేసుకొని ఆదర్శపాఠశాలల్లో 20 సీట్లు పెంచామని వివరించారు. మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ ఎక్కడైనా ఆదర్శ పాఠశాలలో సీట్లు పెంచినా విద్యార్థులను చేర్చుకోక పోతే సమాచారం ఇస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని, జిల్లాలో పాఠశాలకు వౌలిక వసతులు కల్పించాడానికి 540 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పుంగనూరు జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ సర్వశిక్షా అభియాన్‌పరంగా ఎక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయో తెలియదని, ఈ పనుల ఎలా కేటాయిస్తున్నారో అంతుపట్టని రహస్యంగా మారిందన్నారు. వైకాపా ఎమ్మెల్యే తిప్పారెడ్డి , సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ సాక్షర భారత కార్యక్రమాన్ని రద్దు చేయడంతో అనేక మంది సిబ్బంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని సభలోప్రస్తావించారు. మంత్రి జోక్యం చేసుకొని కార్యక్రమానికి కేంద్రం 60 శాతం నిధులు కేటాయించేదని ప్రస్తుతం ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రమోయం లేదన్నారు. వైకాపా సభ్యులు కేంద్రం నిధులు నిలిపి వేస్తే అనేక మంది సిబ్బందిని ఇంటికి పంపడం దారుణమని దీనిపై స్పష్ట మైన నిర్ణయాన్ని తెలపాలని పట్టు పట్టారు. మంత్రి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వంతోవైకాపా జత కట్టుతున్నదని ఆపార్టీ నేతలు ఈవిషయాన్ని కేంద్రంతో చర్చిస్తే బాగుంటుందని తెలపడంతో వైకాపా సభ్యులు దీన్ని రాజకీయం చేయడం తగదని, ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కేంద్రంపై నిందలు వేసి అనేక మంది జీవితాలతో చెలగాటం అడటం దారుణమని, దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జోక్యం చేసుకొని ఇది రాష్ట్ర అసెంబ్లీలో చర్చంచాల్సిన అంశమని, వైకాపా ఎమ్మెల్యేలు శాసన సభకు రారని వారు, సమస్యలను ప్రస్తావించరని తెలపడంతో దీన్ని వైకాపా సభ్యులు అడ్డుకోవడంతో అధికార ప్రతిపక్షాల సభ్యలు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకొంది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చేసుకోవడంతో కొట్టుకొనే పరిస్థితులు నెలకొన్నాయి, కారణంగా సభలో కొంత సేపుగందరగోళ పరిస్థితి నెలకొంది. తదుపరి విద్యుత్ శాఖ పై సభ్యలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ సర్వీసులకు ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా డార్క్ ఏరియా ఆంక్షలు కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేసారు. పలు మండలాల్లో విద్యుత్ కోతలు ఎక్కువయాని సిబ్బంది కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఎమ్మెల్యేలు తిప్పా రెడ్డి, సునిల్, ఎమ్మెల్సీలు దొరబాబు, శ్రీనివాసులు రెడ్డి ఇతర సభ్యలు జిల్లాలో నేడు ప్రధాన సమస్య మామిడికి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, నేడు ధరలు లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయని మామిడికి గిట్టు బాటు ధరలు కల్పించాలని పట్టు పట్టారు. మంత్రి జోక్యం చేసుకొని త్వరలోనే ఈ సమస్య పరష్కారమవుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునిల్ మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ శాఖ సరఫరా చేసిన జిప్స్‌మ్ పక్కదారి పట్టిందని దీనిపై విచారణ జరిపించాలన్నారు. ముఖ్యంగా ఐరాల మండలంలో రైతులకు జిప్సం ఇవ్వడం లేదని సభలో ప్రస్తావించారు. దీన్ని కొందరు టీడీపీ సభ్యులు అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో ఐరాలలో పలువురి రైతులకు జిప్సం అందలేదని నీను నిరూపిస్తానిని. ఒకవేళ నిరూపించకపోతే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
సభలో బైఠాయించిన జడ్పీటీసి సభ్యురాలు: నాగలాపురం జడ్పీటీసి సభ్యురాలు సుజాత తనకు ఎంపిడివో ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సభలో కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళ కావడంతో చులకనగా చూస్తున్నారని, మండలానికి నిధుల మంజూరుతోపాటు ఇతర ఏ విషయాలను తనకు తెలపడం లేదని తన పట్ల మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాల్లో నిధులు స్వాహా అయ్యాయని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌చేసారు. మంత్రి జోక్యం చేసుకొని వెంటనే ఎంపిడివోతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దీంతో ఆమె శాంతించింది. ఈ విషయంగా పలువురు వైకాపా సభ్యులు అధికార పక్ష సభ్యురాలులకే ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్ట కరమన్నారు. అధికార ప్రతిపక్ష సభ్యులు మధ్య వాగ్వివాదం చోటు చేసుకొంది.
2019లో కూడా మాదే గెలుపు మంత్రి : రానున్న 2019వ ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. సాక్షర భారత విషయం సభలో చర్చికు రావడంతోకేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపి వేయడంతోనే ఈ పిరిస్థితి వచ్చిందని, అందులోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రానికి కేంద్రం నిధులు నిలిపి వేసిందని అందు వల్లనే ఈదుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపితో వైకాపా జత కట్టే పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఆపార్టీ నేతలు కేంద్రంతో ఈవిషయంగా చర్చిస్తే బాగుంటుందని చెప్పడంతో, దీన్ని వైకాపా ఎమ్మెల్యేలు ఆపార్టీ జడ్పీటీసీలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. సభలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకొంది. తదుపరి పలువురు వైకాపా నేతలు మాట్లాడుతూ ఈసారి అధికారంలోకి వచ్చిదే ఎవ్వరనేది త్వరలోనే తేలుతుందని చెప్పడంతో, మంత్రి జోక్యం చేసుకొని వైకాపా నేతలు పగటి కలలు కంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు.

అంబేద్కర్ భవన్ ఎదుట సాక్షరభారతి సిబ్బంది నిరసన : చిత్తూరు అంబేద్కర్ భవన్ లో జడ్పీ సమావేశం జరుగుతున్న నేపధ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సాక్షర భారతి సిబ్బంది అంబేద్కర్ భవన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తూ వస్తున్న వారిని తొలగించడంతో అనేక మందికి ఉపాధి లేక పోయిందని, తిరిగి విధుల్లోకి తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిధులు నిలిపి వేయడంతోనే ఈ సమస్య వచ్చిందని దీనిపై క్యాబ్‌నెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.