చిత్తూరు

అవిలాలలో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 26: తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల వద్ద టిటిడిలో పందిళ్లు వేసే గుత్తేదారు జనార్దన్‌కు సంబంధించిన గోడౌన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా సుమారు రూ.50 లక్షలు విలువైన ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. గోడౌన్‌లో ఒక మూల చెలరేగిన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడటంతో కొయ్యలు, ప్లాస్టిక్ షీట్లు, కీతలు, గుడ్డలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో లోపలున్న సెక్యూరిటీ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మంటల కారణంగా దట్టమైన పొగలు పైకి రావడంతో చుట్టుపక్కల గ్రామస్థులు ఉరుకులు, పరుగుల మీద అక్కడకు చేరుకున్నారు. మంటలు అదుపుచేయలేని స్థితిలో ఉంటడంతో గోడౌన్ సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్నిప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా లేక మానవ తప్పిదమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఏదేమైనా అసలే భానుడి ఉగ్రరూపంతో విలవిల్లాడుతున్న అవిలాల ప్రజలు భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలతో మరింత ఇబ్బందిపడ్డారు.