చిత్తూరు

మంత్రి అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్‌కు ఓట్లు వేయాలని బహిరంగంగా కోరిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆవుల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంపారుూస్ యూనియన్ ఘన విజయం సాధించిందని, ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మజ్దూర్ యూనియన్ అక్రమాలకు కార్మికులు చరమ గీతం పాడి ఆర్టీసీకి స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మజ్దూర్ యూనియన్‌కు మద్దతు ఇచ్చారని, ఆ యూనియన్‌ను కార్మికులు ఓడించిన కారణంగా మంత్రి సైతం నైతిక బాధ్యతతో తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఈ.ఆర్.కుమార్, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, డీ.గురునాథం, శివప్రసాద్, ఎస్‌డబ్ల్యుఎఫ్ జోనల్ ప్రెసిడెంట్ కె.పరుశురామ్, భాస్కర్, కార్మిక పరిషత్ నాయకుడు జి.రవి, వైకాపా ఆర్టీసీ యూనియన్ నాయకులు పి.సి.బాబు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కోర్ కమిటీ సభ్యురాలిగా శాంతారెడ్డి
తిరుపతి, ఆగస్టు 10: బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా నియమితులైన శాంతారెడ్డిని శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడలోని పార్టీ కార్యాలయంలో ఆపార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నమ్మిన పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రోత్సాహంతోనే తాను ఆనేక సమస్యలను ఎదుర్కొంటు వచ్చానన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యితిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, జిల్లాకార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కోశాధికారి అక్కిపల్లి మునికృష్ణయ్య, బిజేవైఎం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్, జిల్లాప్రధాన కార్యదర్శి మంకుల దాము రాయల్, బీజేపీ నగర అధ్యక్షుడు వరప్రసాద్, జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ విష్ణువర్థన్, జిల్లాప్రచార కార్యదర్శి గుండాల గోపీనాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాలి ధనంజయ నాయుడు, సుబ్రమణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు, నేసనూరి మోహన్, వెంకటముని, వల్లేపల్లి ప్రసాద్, నాగినేని చంద్రయ్య, పార్థసారథి, ఆనంద్, రమేష్,ప్రేం కుమార్, పృధ్వీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.