చిత్తూరు

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 10: ఆర్టీసీ కార్మికుల సంఘం గుర్తింపు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. గురువారం చిత్తూరు 1, 2 డిపోల్లో ఎన్నికలను నిర్వహించారు. అనంతరం రాత్రి 10గంటల వరకు ఓట్లలెక్కింపు చేపట్టారు. ఈక్రమంలో 1వ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించగా, రెండవ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు విజయం వరించింది. రాష్ట్ర సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు రావడం గమనార్హం.
ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల సంబరాలు
ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో చిత్తూరు 1వ డిపోతో పాటు రాష్ట్ర స్థాయి సంఘం ఎన్నికల్లో విజయఢంకా మోగించటంతో ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన కార్మికులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈక్రమంలో 1, 2వ డిపోకు చెందిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు, అధికారులు, 2వ డిపో వద్దకు చేరుకుని పెద్దఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రెండవ డిపో మెనేజర్ కిరణ్‌కుమార్‌ను గౌరవ పూర్వకంగా కలుసుకుని స్వీట్లు అందచేసారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన మేనేజర్‌కు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మణి, రాధాకృష్ణ, పెద్దఎత్తున యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎర్రచందనం తరలించిన కేసుల్లో ఐదుగురు అరెస్ట్
నాగలాపురం, ఆగస్టు 10: నాగలాపురం మండల పరిధిలోని నందనం గ్రామం సమీపాన ఈ ఏడాది జూన్ 28న టీఎన్ 07- బివై 002 అనే వాహనంలో 90 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి, ఆ సమయంలో కారుడ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ మట్లాడుతూ ఎర్రచందనం తరలింపునకు సహకరించిన మండలంలోని ఈసంగాడు గ్రామానికి చెందిన మురుగేష్ (27), తుపాకుల మురళి (35), మోహన్‌బాబు (30), గోవిందరాజన్ (50), రవి (37) అనే ఐదుగురిని అరెస్ట్‌చేసి రిమాండ్ నిమిత్తం సత్యవేడు కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి పెద్ద డాన్ అయిన చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన సంతోష్‌ను పట్టుకోవడానికి గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు.