చిత్తూరు

రైల్వేలో, టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన ఐదు మంది నిరుద్యోగులకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిసానని, రూ. 27.50లక్షలు, తిరుపతికి చెందిన ముగ్గురుకి టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.23.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన బాలిశెట్టి రెడ్డిప్రసాద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు తిరుపతి క్రైం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సోమల మండలం, కందూరు గ్రామానికి చెందిన బాలిశెట్టి రెడ్డిప్రసాద్ (37) స్థానికంగా ఉన్న ఒక న్యూస్ చానల్‌లోను ఆ తరువాత వివిధ పత్రికలకు తిరుమలలో ప్రోటోకాల్ అటెండర్ అంటూ కొత్తవారికి పరిచయం చేసుకునేవాడు. తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్న ఇతనిని చానల్, పత్రికల యాజమాన్యాలు తమ తమ సంస్థల నుంచి తొలగించాయని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ బాలిశెట్టి రెడ్డిప్రసాద్ తానే నకిలీ అక్రిడేషన్ కార్డులను తయారు చేసుకుని అక్రమాలకు పాల్పడేవాడన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా పలువురు వ్యాపారులకు వారిపేరు మీద లైసెన్సులు ఇప్పిస్తానని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి జల్సాలకు ఖర్చు పెట్టుకున్నాడని చెప్పారు. తిరుమలేశుని దర్శనార్థం తిరుమలకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నల్గొండకు చెందిన గార్లపాటి సుధాకర్ రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, వెంకటేష్ రెడ్డి, శంతన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తాను కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులకు, రాజకీయ నాయకులకు ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు వారికి చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మిన వీరు ఒక్కో ఉద్యాగానికి రూ. 10 లక్షలు చొప్పున ఇవ్వడానికి సిద్ధపడి, ఐదుమంది రూ. 27.50లక్షలు రెడ్డిప్రసాద్‌కు ఇచ్చారు. డబ్బు తీసుకుని వారిని మోసం చేసిన రెడ్డి ప్రసాద్ ఆడబ్బుతో క్రికెట్ బెట్టింగ్‌లు కడుతూ జల్సాలు చేశాడు. తిరుపతికి చెందిన కె.రవితేజ, ఎస్.కృష్ణ, ఆర్.గోపాల్ అనేవారికి టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓక్కో ఉద్యోగానికి రూ. 15లక్షలు డిమాండ్ చేశాడు. అతని మాటలు నమ్మిన వీరు రూ. 23.50లక్షలు ఇచ్చారు. తాము మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో తిరుపతి క్రైం ఎస్‌ఐ ఈ.వి.వెంకటనరసింహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడుని గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు.