చిత్తూరు

డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటనపై సీఎంకు వివరించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: డాక్టర్ శిల్ప ఆత్మహత్య సంఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సవివరంగా తెలియజేశారు. తిరుపతిలో స్మార్ట్ ఎలివేట్ కారిడార్ (ఫ్లై ఓవర్) నిర్మాణం అంశంపై ముఖ్యమంత్రితో చర్చించడానికి కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం ఉదయం అమరావతికి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ శిల్ప ఆత్మహత్య, జూడాలు, ప్రజాసంఘాల ఆందోళన, మీడియాలో వచ్చిన వార్తా కథనాల గురించి వివరించారు. అటు తరువాత తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు, జేసీ 2 చంద్రవౌళి జిల్లా యంత్రాంగం తరపున జూడాతో కలిసి చర్చించిన అంశాలు, వారి డిమాండ్లు, హైపవర్ కమిటీ విచారణ, జూడాల డిమాండ్లపై జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించిన తీరు, శిల్ప తల్లిదండ్రులు తనను కలిసి కోరిన డిమాండ్లను వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వ డాక్టర్లు తీసుకున్న నిర్ణయం, సీఐడీ విచారణ తదితర అంశాలను సీఎంకు వివరించారు. ప్రధానంగా సీఐడీ విచారణను వేగవంతం చేసి తన కుమార్తె మరణానికి కారణమైన వారిని శిక్షించాలని తల్లిదండ్రులు, జూడాలు, ప్రజా సంఘాలు, డాక్టర్లు కోరారని సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఐడీ విచారణ వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ సీఎంను కోరారు. దీనిపై స్పందించిన సీఎం విచారణ వేగవంతం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
తొందరపడకండి... రోగులకు ఇబ్బందులు కలిగించకండి
* డాక్టర్లకు.. జూడాలకు కలెక్టర్ విజ్ఞప్తి
డాక్టర్ శిల్ప మరణంపై ఇప్పటికే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుని విచారణను వేగవంతం చేసిందని, ఈ క్రమంలో త్వరలోనే తాను జూడాలు, ప్రభుత్వ డాక్టర్లతో ఎస్వీమెడికల్ కళాశాలలో సమావేశం నిర్వహిస్తానని, ఈలోపు తొందరపడి రోగులకు ఇబ్బంది కలిగించే చర్యలకు దిగవద్దని కలెక్టర్ కోరినట్లు రాష్ట్ర సమాచార శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. నిరుపేద రోగుల వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని జూడాలు, ప్రభుత్వ డాక్టర్లు తొందర పడవద్దని సంయమనం పాటించాలని ఆ ప్రకటనలో కోరారు. వైద్యులు విధులకు, విద్యార్థులకు క్లాసుల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆ ప్రకటనలో కోరారు.