చిత్తూరు

జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, ఆగస్టు 13: నారాయణవనం దిగువ పద్మశాలి వీధికి చెందిన శేఖర్, రేణుక దంపతుల పెద్ద కుమార్తె మునిప్రియ (4) జ్వరం అధికమవ్వడంతో మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణవనం మండలంలోని టీటీడీ ఆలయంలో వాయిద్యకారుడిగా పనిచేస్తున్న శేఖర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమార్తె మునిప్రియకి గత శుక్రవారం నుండి జ్వరం వచ్చింది. జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో ఆదివారం సాయంత్రం పుత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. పాపకు జ్వరం తగ్గకపోవడంతో రాత్రి అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా, తిరుపతిలోని ఓ ప్రైవేటు చిన్నపిల్లల ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో పాపను తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి పాప అరగంట ముందే చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పాప మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకువచ్చి సోమవారం సాయంత్రం దహనక్రియలు చేశారు. అయితే పాప తల్లిదండ్రులు పుత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సకాలంలో వైద్యం చేయకపోవడం వల్లే తమ పాప మృతిచెందిందని, సకాలంలో వైద్యసేవలు అందించి ఉంటే బతికేదని వాపోయారు. ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా ఇద్దరు మృతి చెందినట్లు తమకు తెలిసిందని వారు వాపోయారు.