చిత్తూరు

ప్రేమ బంధం వదులుకోలేక... తల్లిని ఎదిరించలేక...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 13: విశేషమైన ప్రతిభతో, ఓసీ కోటాలో ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. మరో రెండు సంవత్సరాలు పూర్తి చేస్తే డాక్టర్‌గా పట్టా పుచ్చుకునే పరిస్థితి గీతికా రెడ్డిది.. ఈ క్రమంలో ఓ యువకుడితో స్నేహం చేసింది... స్నేహం ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని భావించింది. తన కోరికను తల్లికి వెల్లడించింది. అమ్మ ససేమిరా అంది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురవుతూ చదువులో కూడా వెనకబడుతూ వచ్చింది. చివరకు గీతిక రెడ్డి బలవన్మరణంతో తన బంగారు భవిష్యత్తుకు తనకు తానుగా చరమగీతం పాడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గీతిక రెడ్డి వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె రాసుకున్న సూసైడ్ నోట్ పోలీసులకు దొరకడంతో వాస్తవాలు వెల్లడయ్యాయి. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడ్డ ఐదు రోజులకు గీతిక రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్వీ మెడికల్ కళాశాలలో ఏదో జరిగిపోతోందన్న అపోహలు విచ్చలవిడిగా వ్యాపించాయి. ఇప్పటికే శిల్ప ఆత్మహత్యతో ప్రొఫెసర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గీతిక రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం ప్రొఫెసర్లు, డాక్టర్లలోనూ తెలియని ఆందోళన చెలరేగింది. చివరికి గీతిక రెడ్డి వ్యక్తిగత సమస్యతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తల్లికి లేఖరాయడం, ఆ లేఖను పోలీసులు గుర్తించడంతో ప్రొఫెసర్లు, డాక్టర్లు ఉపశమనం పొందారనే చెప్పాలి. అయినప్పటికి డాక్టర్ శిల్ప ఆత్మహత్య వ్యవహారం మాత్రం ప్రొఫెసర్లను వెంటాడుతూనే ఉంది. ఇదిలావుండగా గీతిక రెడ్డి తన అమ్మకు రాసిన సూసైడ్ నోట్ వివరాలు ఇలా ఉన్నాయి...
ప్రేమ బంధాన్ని వదులుకోలేను.. బతకలేను..
* అమ్మ నన్ను క్షమించండి
‘‘ అమ్మా... నన్ను క్షమించు. నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు... ఎందుకో అమ్మ ఇంక బతకాలని లేదు కూడా. కానీ నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదమ్మా... అందరి గురించి ఆలోచించి.. అందరమ్మాయిల్లాగా నాకు భర్త.. కుటుంబం.. ప్రేమ కావాలనుకున్నా.. కాని నాజీవితంలో నేను ఓడిపోయానమ్మా.. తను లేకుంటే బతకలేను. కనీసం నా జీవితం కోసమైనా తనను ఏమీ చేయకమ్మా.. నన్ను క్షమించమ్మా.. నేను పిరికిదాన్ని కాదమ్మా.. కాని నాకు వేరే దారి కనిపించడంలేదు. తను లేకుంటే బతకలేను అని, తనతో కలిసి బతకలేను. అందుకే వెళ్లిపోతున్నా..’’ అంటూ గీతికారెడ్డి రాసిన సూసైడ్ నోటు పలువురిని కంట తడిపెట్టించింది. ఇదిలావుండగా ఆయితే గీతిక రెడ్డి తల్లి హరితాదేవి మాత్రం వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులో వెనకబడిందని, మరికొన్ని వ్యక్తిగత సమస్యలతో మానసిక సమస్యలకు లోనై ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు, విలేఖరులకు తెలిపింది. ఈస్ట్ డీఎస్పీ మునిరామయ్య మాట్లాడుతూ తన వ్యక్తిగత సమస్యలతోనే గీతిక రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొందన్నారు. ఇందులో కళాశాలకు గాని, ప్రొఫెసర్లకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తొందరపడి అపోహలతో వార్తలు రాయకండి
* విలేఖర్లకు కలెక్టర్ వినతి
గీతిక రెడ్డి ఆత్మహత్య పూర్తిగా వ్యక్తిగతమని ప్రాధమిక విచారణలో తేలిందని, తొందరపడి అపోహలతో ప్రొఫెసర్లు, డాక్టర్లుపైన నిందలు మోపే వార్తలు రాయవద్దని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి గీతిక మరణ వార్త తెలుసుకున్న ఆయన అర్ధరాత్రి సమయానికి ఎస్వీ మెడికల్ కళాశాలను సందర్శించారు. సోమవారం గీతిక రెడ్డి పంచనామా నిర్వహించడంతో తిరుపతికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సున్నితమైన సంఘటనలపై తొందరపడి వార్తలు రాయడం ద్వారా ప్రొఫెసర్లు, డాక్టర్ల మనోధైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రొఫెసర్లు, మెడికల్ విద్యార్థుల మధ్య సత్సంబంధాలే ఉంటాయన్నారు. ప్రొఫెసర్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా అని.. అపోహలతో కూడుకున్న వార్తలు వస్తే వారి కుటుంబ సభ్యులు కూడా ఎంత కలత చెందుతారో ఆలోచించాలన్నారు.
నేడు వ్యక్తిత్వ వికాసంపై మెడికల్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఎస్వీ మెడికల్ కళాశాలలో మెడికో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిలో మానసిక చైతన్యం తీసుకువచ్చేందుకు ఎస్వీ మెడికల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రద్యుమ్న కళాశాల ప్రిన్సిపాల్ రవిప్రభును ఆదేశించారు.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని పూజిత ఆత్మహత్యా యత్నం
* ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న పూజిత అనే విద్యార్థిని బలవన్మరణానికి ప్రయత్నించి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గత మూడు రోజుల క్రితం పూజిత ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో జరుగనున్న పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి గురైన పూజిత ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినా గీతిక రెడ్డి మృతదేహానికి పంచనామా జరుగుతున్న సందర్భంగా కొందరు విద్యార్థులు యాదృచ్ఛికంగా ఈ విషయంపై వ్యాఖ్యానించడంతో వెలుగుచూసింది.
శిల్ప.. గీతికల బలవన్మరణాల వెనుక ఒకే రకమైన కారణం
* డాక్టర్ చింతా మోహన్
ఎంబీబీఎస్ విద్యార్థిని గీతిక రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆమె మృత దేహానికి పంచనామా నిర్వహిస్తున్న సందర్భంగా మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అక్కడకు చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గీతిక రెడ్డి పూర్తిగా వ్యక్తిగత కారణాలతో మృతి చెందిందని, ఆమె ఆత్యహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై వ్యాఖ్యానించాలని విలేఖరులు కోరినప్పుడు ఆయన మాట్లాడుతూ గీతిక రెడ్డి మృతదేహం ఉన్న మార్చురీ వద్ద ఇలాంటి సున్నితమైన అంశాలను మాట్లాడటం తనకు ఇష్టం లేదన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అన్నీ వివరంగా మాట్లాడతానన్నారు. డాక్టర్ శిల్ప, గీతిక రెడ్డిల బలవన్మరణాలకు ఒకే రకమైన కారణాలు ఉండవచ్చని తాను భావిస్తున్నానన్నారు. గీతిక రెడ్డి మణికట్లుపై రక్తం మరకలు ఉన్నాయని, ఆర్‌డిఓ దానిని పంచనామా చేస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రొఫెసర్లతో కాదని, యవ్వనంలో తలెత్తుతున్న ఆలోచనా సరళితో అని భావిస్తున్నానన్నారు.
మెడికల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి
మెడికో విద్యార్థులు ఇటీవల వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆత్మహత్యలను నివారించాలని తాను భావిస్తున్నట్లు వైకాపా మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. రుయా మార్చురీ వద్ద ఉన్న గీతిక రెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం వరప్రసాద్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇలాంటి అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.

శ్రీవారి ఆలయంలో భక్తులతో ముచ్చటించిన జేఈఓ
తిరుపతి, ఆగస్టు 13: శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం క్యూలైన్‌లో ఉన్న భక్తులతో జేఈఓ శ్రీనివాసరాజు ముచ్చటించారు. శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా దర్శనానికి పడుతున్న సమయం, ఇతర సౌకర్యాల గురించి జేఈఓ అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కేంద్రంలో 16 నుంచి అందుబాటులోకి డయాలసిస్ యూనిట్‌లు
* అపోలో వైద్యులకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం
తిరుపతి, ఆగస్టు 13: జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 16వ తేదీ నుంచి డయాలసిస్ యూనిట్, గర్భిణుల అత్యవసర చికిత్సా విభాగాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రి, అపోలో వైద్యులను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాప్రధాన ప్రభుత్వ కేంద్ర వైద్యాధికారులతో, అపోలో వైద్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న ఓపీ, అత్యవసర చికిత్సలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. అపోలో,ప్రభుత్వ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్న వైద్య సేవలు మెరుగ్గా ఉండాలన్నారు. డయాలసిస్, గర్భిణుల అత్యవసర చికిత్సకు సంబంధించి రెండు విభాగాలు ఈనెల 16న 6పారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అన్నారు. మరో ప్రాజెక్టు ట్రామాకేర్ సెంటర్‌ను కూడా త్వరలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలన్నారు. డయాలసిస్ విభాగంలో అందుబాటులోకి రానున్న సౌకర్యాలు డీసీహెచ్‌ఎస్.సరళమ్మ కలెక్టర్‌కు తెలిపారు. 6 పడకలతో మూడు షిప్టులతో 18 మంది రోగులుకు డయాలసిస్ చేయడానికి వీలవుతుందన్నారు. ఈ సమావేశంలో జేసీ 2 చంద్రవౌళి, ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండురంగయ్య, ఎన్‌టిఆర్ ట్రస్టు డాక్టర్ హర్షవర్థన్, అపోలో ఆస్పత్రి ప్రతినిధి నరేష్ పాల్గొన్నారు.