చిత్తూరు

భారతదేశ పోలీస్‌మెడల్ సాధించిన ఏఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 14: టాస్క్ఫోర్స్ కార్యాలయం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. తన వృత్తి ధర్మంలో పలు సాహసాలను ఎదుర్కొని విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆయనకు భారతదేశం 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌మెడల్‌ను ప్రకటించింది. ఆయన ఎమ్మెస్, ఎంఫిల్, ఎల్‌ఎల్‌బీ, బీఈడీ వంటి డిగ్రీలు పొంది ఉన్నారు. ఎన్నో ఇతర అవకాశాలు వచ్చినా పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో ఈ శాఖలో చేశారు. ఇటీవలే ఆయన ఏఎస్పీగా పదోన్నతి పొంది శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మొదటగా తూర్పు గోదావరి, హైదరాబాద్‌లలో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించి అంచెలంచెలుగా సీఐ, డీఎస్పీ స్థాయికి ఎదిగి, ప్రస్తుతం ఏఎస్పీగా పదోన్నతి పొందారు. తన సర్వీసులో 260 రివార్డులు పొంది అరుదైన రికార్డును సాధింవచారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ పోలీస్ మెడిల్ ఫర్ మెరిటరియస్ సర్వీస్ అవార్డును అందుకోనున్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల ఐజీ కాంతారావు, టాస్క్ఫోర్స్ సిబ్బంది అభినందనలు తెలిపారు.

సౌర విద్యుత్‌కు ఎస్పీడీసీఎల్ ప్రోత్సాహం
* ఎస్‌ఈ చలపతి వెల్లడి
తిరుపతి, ఆగస్టు 14: నగరంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఎస్పీడీసీఎల్ చర్యలు చేపడుతోందని తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చలపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి పట్టణ పరిధిలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేటగిరి 1 ఏ (నెలకు వంద యూనిట్లలోపు వినియోగం) వినియోగదారులు 500 డబ్ల్యుపీ సామర్థ్యం కలిగి సోలార్ ప్యానెల్స్, పరికరాలను కేవలం 5వేల రూపాయలు, కేటగిరి1 బి (నెలకు 100 నుండి 200 యూనిట్ల వరకు వినియోగం) వినియోగదారులు 7,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 1000డబ్ల్యుపీ సోలార్ ప్యానెల్స్ కోసం కేటగిరి1బి వినియోగదారులు 15వేల రూపాయలను చెల్లించాలన్నారు. సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడానికి వినియోగదారుల ఇంటి పైకప్పులో ఒక కిలోవాట్‌కు 100చదరపు అడుగులు ఖాళీ ప్రదేశం ఉండాలన్నారు. సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగదారులు తమ సమీపంలోని మీసేవ కేంద్రంలో 50రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్, మొబైల్ నెంబర్ 9491052933ని సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు.