చిత్తూరు

లక్ష్యసాధన దిశగా కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 14: విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగాలని ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా నారాయణమూర్తి ఉద్బోధించారు. మంగళవారం ఆమె శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పచుకోవాలన్నారు. తాను ఇన్ఫోసిస్‌కి గ్లోబల్ గుర్తింపు కోసం పిల్లలను సైతం పక్కనపెట్టి కష్టపడి పనిచేశానన్నారు. ఇన్ఫోసిస్ ద్వారా ఎంతోమందికి ఉత్తమ భవిష్యత్తు ఇచ్చామన్న సంతృప్తి కలిగిందన్నారు. లక్ష్యసాధనకు కృషి చేసే సమయంలో ఎదురయ్యే అడ్డంకులను లెక్కచేయకుండా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన అనేక సందేహాలకు ఆమె తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. అనంతరం వర్శిటీ వీసీ ఆచార్య దుర్గ్భావాని, అధ్యాపకులు ఆమెను ఘనంగా సన్మానించారు.

మెగారక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి
* చిత్తూరులో 320 అడుగుల త్రివర్ణ పతాకం ఊరేగింపు
చిత్తూరు, ఆగస్టు 14: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం చిత్తూరు నగరంలో నిర్వహించనున్న మెగారక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని ఆలిండియా పీపుల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధ్యక్షులు ఆర్.రామకృష్ణ పిలుపునిచ్చారు. వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం చిత్తూరు నగరంలో 320 అడుగుల పొడవు ఉన్న భారీ త్రివర్ణ పతాకాన్ని ఊరేగించారు. స్థానిక గాంధీ, పూలే, ఎన్టీఆర్ సర్కిళ్లు, చర్చివీధి, చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, బాలాజీనగర్, దర్గాసర్కిల్, ఎంఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా సాగింది. నగరానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని రక్తదాన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. రామకృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా తమ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ద్వారా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ప్రభుత్వ ప్రధాన వైద్యశాల రక్తనిధికి అందచేస్తున్నామన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్న కార్యక్రమానికి చిత్తూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువత నుంచి పెద్దఎత్తున స్పందన వస్తుండడం హర్షణీయమన్నారు. బుధవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లి శేషాద్రి కల్యాణ మండపంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరానికి దాతలు తరలివచ్చి రక్తం ఇచ్చి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.