చిత్తూరు

అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 14: జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం సాయంత్రం చిత్తూరులోని జిల్లా సచివాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికి సరైన వర్షం కురవకపోవడం వల్ల కొంత నష్టం జరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయం పరిస్థితులపై మాట్లాడుతూ జిల్లాలో వేరుశగన పంట సాగు చేయని చోట ఉలవలు వేసే విధంగా రైతులను చైతన్యపరచాలని, వేరుశనగ పంట ఎండిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పశువులకు గ్రాసం కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పశువులకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. గడ్డిని అందుబాటులో ఉంచుకోవాలని పశుసంవర్థక శాఖ జేడిని ఆదేశించారు. గ్రామాల్లో వలసలు పోకుండా కూలీలకు ఉపాధి హామి పనులు కల్పించాలన్నారు. పంట కుంటలు విరివిగా తవ్వాలని డ్వామా పీడీకి సూచించారు. జిల్లాలో ఇప్పటికి ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవడంతో నీటి సమస్య ఎక్కడా లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్య ఎక్కడా లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసి గిరీష, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో వైద్య సేవలు ముమ్మరం చేయాలని, అంటురోగాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు చిత్తూరు - తిరుపతి రోడ్డు మార్గంలోని ఆర్‌విఎస్ కాలేజి వద్ద జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న గడ్డర్ లాంచింగ్ పనుల విధివిధానాలపై అధికారులతో ఆరా తీసారు. ఈ పనులు మరింత వేగవంతం కావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.