చిత్తూరు

శుద్ది పనులను పరిశీలించిన ఈఓ, జేఈఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 14: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ది పనులను మంగళవారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజులు కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ శిఖరానికి అలంకరించేందుకు 1.5లక్షల రూపాయల విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్తంభానికి మధ్య ఉంచేందుకు 4లక్షల రూపాయల విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వరస్వామిని అలంకరించేందుకు 1.75లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని టీటీడీ సిద్ధం చేసింది. వీటి ఏర్పాటు పనులను ఈఓ, జేఈఓలు పరిశీలించారు.
నేడు మహాశాంతి పూర్ణాహుతి
అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా ఆగస్టు 15న బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3నుండి రాత్రి 7గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, ఆ తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, ఓఎస్‌డీ పాల శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాథ్, బొక్కసం సూపరింటెండెంట్ గురురాజారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో ఆగస్టు 15న బుధవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గోకులం విశ్రాంతి భవనంలోని జేఈఓ క్యాంపు కార్యాయలంలో జెండా పండుగ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఆవిష్కరించనున్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.