చిత్తూరు

వాజ్‌పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 16: మచ్చ లేని నాయకుడిగా దేశానికి నిస్వార్థ సేవలు అందించిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతిచెందిన వాజ్‌పేయికి బీజేపీ నాయకులు, పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు నివాళులు అర్పించారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ పార్టీ నాయకులు చిలకం రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, గుండాల గోపీనాథ్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్, పొనగంటి భాస్కర్, వరప్రసాద్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతితో వాజ్‌పేయికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయన 1999, 2003లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి స్వామిని దర్శించుకున్నారన్నారు. ఆయనను కలిసేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ ఎంతో ఆత్మీయంగా పలకరించి క్షేమసమాచారం తెలుసుకునే గొప్ప నాయకుడు వాజ్‌పేయి అన్నారు. తన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొని భారతీయ జనతాపార్టీ అభివృద్ధికి అవిరళ కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
ఆయన లేని లోటు తీరనిది
భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటని రాస్ ప్రధాన కార్యదర్శి మునిరత్నం అన్నారు. వాజ్‌పేయి మరణవార్త తనను తీవ్రంగా విచారానికి గురి చేసిందన్నారు. భారత ప్రధానిగా ఆయన 2000 సంవత్సరంలో తిరుమల పద్మావతి అతిథిగృహంలో ప్రత్యేకంగా తనకు కలిసే అవకాశం కల్పించారన్నారు. ఈ సందర్భంగా మహిళా పొదుపు పరపతి సంఘాల ద్వారా మహిళలు చేస్తున్న చిరువ్యాపారాలు, ఆర్థిక సాధికారిత పొందుతున్న విషయాన్ని ఢిల్లీలోని మహిళా సంఘాల ద్వారా తెలుసుకున్నానని తనను అభినందించారన్నారు. తన వద్ద అన్ని విషయాలు అడిగి తెలుసుకుని రాస్‌కు 100 కోట్ల రూపాయలు కేంద్రప్రభుత్వం నుండి మంజూరు చేస్తానని చెప్పి నెలరోజుల్లో విడుదల చేసిన గొప్ప మహనీయుడని ఆయన కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలు, రైతాంగం సంక్షేమం గురించి ఆయన ఎక్కువ ఆసక్తి చూపేవారని చెప్పారు. ఆయన మహనీయుని ఆత్మకు శాంతిని ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.
భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయింది: విజయలక్ష్మి
సుమారు 70 సంవత్సరాల పాటు జనసంఘ్ పార్టీ నుండి ఇప్పటి భారతీయ జనతాపార్టీ వరకు నీతివంతమైన నాయకుడుగా ప్రపంచం మొత్తం కొనియాడిన భరతమాత ముద్దుబిడ్డ వాజ్‌పేయిని కోల్పోయిందని టీడీపీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. 1984లో టీడీపీ వెన్నుపోటుకు గురైన సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పార్లమెంట్‌లో ఎదురించి పోరాడిన మొనగాడు వాజ్‌పేయి అన్నారు. అన్ని మతాలను సమానంగా చూస్తూ ధర్మమైన, నీతివంతమైన పాలన చేసి ప్రపంచ దార్శనీకుడుగా పేరొందిన వాజ్‌పేయి మరణం దేశప్రజలకు తీరని దుఃఖానే్న మిగిల్చిందన్నారు.