చిత్తూరు

రేపు మహతిలో మహిళా సాధికారిత, రైతుల అభివృద్ధిపై సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 16: రాష్ట్రీయ సేవా సమితి (రాస్) ఆధ్వర్యంలో ఈనెల 18 శనివారం నాడు మహిళా సాధికారిత, రైతుల అభివృద్ధి అన్న అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుత్తా మునిరత్నం వెల్లడించారు. గురువారం స్థానిక రాస్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం రాస్ గత మూడున్నర దశాబ్దాలుగా ఎనలేని కృషి చేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకోవడంతో పాటు వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేసే విధానం, నాణ్యమైన విత్తనాల పంపిణీ తదితర వాటిపై చైతన్యం తీసుకురావడానికి గత 25 సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సిల్వర్‌జూబ్లీ, మహిళల కోసం రాస్ గత 37 సంవత్సరాలుగా చేస్తున్న కృషి వెరసి మహతిలో ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారన్నారు. శనివారం సాయంత్రం 4.45గంటలకు ఉప రాష్టప్రతి మహతి ఆడిటోరియంకు చేరుకుంటారన్నారు. 5.25గంటలకు మహిళలు, రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. అనంతరం మహిళలకు 37 సంవత్సరాలుగా రాస్ అందిస్తున్న సేవలు, 25 సంవత్సరాలుగా రైతులను చైతన్యపరుస్తూ వ్యవసాయరంగం అభివృద్ధి చేస్తున్న కృషికి సంబంధించి రూపొందించిన సావనీర్‌ను ఉప రాష్టప్రతి ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం రాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.వెంకటరత్నం ఉపరాష్టప్రతిని సన్మానిస్తారని, ఆరుగంటలకు ఉపరాష్టప్రతి మహతి నుండి బయలుదేరి వెళతారన్నారు.