చిత్తూరు

వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 16: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో సంస్థ, ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన డయాలసిన్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోఎన్నడూలేని విధంగా నేడు ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా 133 జబ్బులకు ఉచితంగా చికిత్స చేస్తామన్నారు. చిన్నారులకు ఎన్టీఆర్ కిట్లు, తల్లికి బసవతారకం ట్రస్టు ద్వారా కిట్లు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక సదుపాయాలు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. పేదలకు కిడ్నీ వ్యాధి వస్తే ఆరోగ్యం చెడిపోవడంతోపాటు వైద్య ఖర్చుల కారణంగా ఆర్థికంగా చితిక పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించిన తరువాత ఈ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని, ఇందుకు నిదర్శనం ఓపి సంఖ్య పెరగడమేనన్నారు. అపోలో సంస్థ అదినేత ప్రతాప్ సి రెడ్డి తన సొంత గ్రామంలో కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని, అలాగే చిత్తూరు ఆసుపత్రిని లీజుకు తీసుకొని అనేక అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే చిత్తూరులోట్రామా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆసుపత్రిలో పని చేసే వైద్య సిబ్బంది సేవాభావంతో పని చేయాలన్నారు. చిత్తూరు ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఆరోగ్యం విద్య సదుపాయాలు బాగా ఉన్న చోట అభివృద్ధి కూడా బాగా ఉంటుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు లీజ్‌కు ఇవ్వడం ఒక ప్రయత్నమన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్ నెంటర్ ఎన్టీఆర్ వైద్య సేవలు, అపోలో సంస్థల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని కావును చిత్తూరులో ట్రామా కేర్ సెంటర్ అత్యవసరమన్నారు. అలాగే పీలేరులో కూడా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. చిత్తూరులో వీలైనంత త్వరగా ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటుకు అపోలో సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య విద్యార్థులు వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాలన్నారు. వచ్చే రోగులకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. అపోలో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అపోలో సంస్థకు గుండెలాండిదన్నారు. తన తండ్రి స్వగ్రామమైన అరగొండ ప్రజలకు మంచి వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆ గ్రామంలో వంద పడకల అసుపత్రిని నిర్మించామన్నారు. చిత్తూరు ఆసుపత్రిని లీజుకు తీసుకోవడం ఒక ప్రయోగమన్నారు. ఇక్కడ మంచి ఫలితాలు వస్తే రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. జడ్పీ చైర్‌పర్స్‌న్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ చిత్తూరు ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటులో అలస్యమైనా ప్రస్తుతం దీన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. పేదలకు ఏంతో ఉపయోగమన్నారు. ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ చిరకాల కోరిక నెరవేరిందని, ముఖ్యమంత్రి చొరవతో పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చిత్తూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించామని, ఎట్టకేలకు సెంటర్ ప్రారంభం కావడం గొప్ప పరిణామన్నారు. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అపోలో సంస్థ తక్షణమే వైద్య సేవలు అందించేందుకు జాతీయ రహదారుల్లో కొన్ని అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నగర మేయర్ కఠారి హేమలత మాట్లాడుతూ చిత్తూరు పరిసర ప్రాంత వాసులు దీర్ఘకాలిక కోరిక నేరవేరిందన్నారు. ఆసుపత్రిలోని డాక్టర్లు ఇతర సిబ్బంది మానవతాదృక్పథంతో సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, డీసీహెచ్ ఎస్ సరళ, చిత్తూరు ఆసుపత్రి ప్రతినిధి పాండురంగనాథ్, అపోలో సంస్థ ప్రతినిధి ఉమామహేశ్వర్ రావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు నాని, టీడీపీ నేత వైవి రాజేశ్వరి పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.