చిత్తూరు

24న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 16: సిరులతల్లి తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాదికారి పోలా భాస్కర్ వెల్లడించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఆయన వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ వరలక్ష్మీవ్రతం టికెట్లను ఆగస్టు 23వతేదీన 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్‌లో విక్రయించాలని అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు. కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, కరపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. వరలక్ష్మీవ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారాలు అదించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
పురాణప్రశస్త్యం
పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్టత, ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు స్కంథ, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తోంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రావణమాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘ మాంగళ్య సౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందని అర్చకులు తెలిపారు.
వరలక్ష్మీవ్రతం పోస్టర్ల ఆవిష్కరణ
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీవ్రతం పోస్టర్లను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం జేఈఓ మాట్లాడుతూ ఆగస్టు 24వతేదీ శుక్రవారం ఉదయం 10 నుండి 12గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామన్నారు. అనంతరం సాయంత్రం 6గంటలకు స్వర్ణరథంపై శ్రీపద్మావతి అమ్మవారు నాలుగుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. వరలక్ష్మీవ్రతంలో భక్తులు 500రూపాయలు చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చునన్నారు. ఈ కారణంగా అభిషేకానంతరం దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డిప్యూటీ డీఓ మునిరత్నంరెడ్డి, వీజీవో అశోక్‌కుమార్ గౌడ్, డీపీపీ కార్యదర్శ రమణప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.