చిత్తూరు

మహాసంప్రోక్షణలో ప్రత్యేక ఆకర్షణగా గంటా నాదం, డోలు, నాదస్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 16: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం జరిగిన మహాసంప్రోక్షణ సందర్భంగా బంగారువాకిలి చెంత నిర్వహించిన చల్లింపు, శుద్ది, నివేదన సమయాల్లో గంటానాదం, డోలు, నాదస్వరం విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆనందనిలయంలో బంగారు వాకిలి ఉన్న మండపాన్ని మహామణి మండపం లేదా గంటా మండపం అంటారు. ఇందులో నాలుగు వరుసల్లో మొత్తం 16 స్తంభాలుంటాయి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మంత్రి మల్లన్న 1417వ సంవత్సరంలో దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ మండపంలో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీనరసింహ, శ్రీవరాహ, శ్రీమహావిష్ణు, శ్రీవరదరాజస్వామివారి ప్రతిమలున్నాయి. సుప్రభాత పఠనం, కొలువు, పంచాంగశ్రవణం, ఆదాయ వ్యయ నివేదన తదితరాలతో పాటు సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవలు ఈ మండపంలోనే జరుగుతాయి. దీనిని ఆస్థానమండపం అని కూడా అంటారు. ఉగాది, దీపావళి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, ఆణివార ఆస్థానం తదితర పర్వదినాలను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ మండపంలో దక్షిణం వైపున రెండు గంటలున్నాయి. నైవేద్య నివేదన సమయంలో ఒక గంట పాటు ఈ రెండు భారీ గంటలు మోగిస్తారు. ఈ కారణంగా దీన్ని తిరుమామణి మండపం అని అంటారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఘంటాపాణి రవి గురువారం చల్లింపు, నివేదన సమయంలో ఒకటిన్నర గంట పాటు నిర్విరామంగా ఈ రెండు భారీ గంటలను మోగించి స్వామి పట్ల తన భక్తిప్రపత్తులను చాటుకున్నాడు. ఎంతో ఏకాగ్రతతో గంటలను మోగించిన రవిని ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తలమండలి చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఇతర బోర్డు సభ్యులు అభినందించారు. అదే విధంగా నైవేద్య నివేదన సమయంలో చెన్నైకి చెందిన నాదస్వర, డోలు విద్వాంసులు విద్వాన్ ఎంకెఎస్ శివ, ఎంకెఎస్ నటరాజన్ వాద్య విన్యాసం వినసొంపుగా సాగింది. ఈ సందర్భంగా వారు నాగవరాళి, త్యాగరాజ కీర్తనలు, పిబరీ రామరసం.., వేంకటాచల నిలయం.. తదితర కీర్తలను వీనులవిందుగా తమ వాయిద్యాల్లో పలికించారు.