చిత్తూరు

అక్రమక్వారీ పేలుడు పదార్థాలు కలిగి ఉంటే రెండేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 17: జిల్లాలో అక్రమంగా క్వారీలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తిస్తే రెండేళ్ల జైలుశిక్ష ఉంటుందని జాయింట్ కలెక్టర్ గిరీష హెచ్చరించారు. శుక్రవారం ఉదయం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని క్వారీ, ఇసుక అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీ పేలుళ్లలో గుంటూరు సంఘటన పునరావృతం కాకూడదన్నారు. అక్రమ మైనింగ్ జరిపిన పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రెండేళ్ల జైలుశిక్ష ఉంటుందని తెలిపారు. అందుకే మండల స్థాయిలో మైనింగ్ టాస్క్‌పోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇందులో ఎంపీడీవో, తహశీల్దార్, ఆర్‌ఐ, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి మెంబర్లుగా ఉండి, ప్రతి 15రోజులకు ఒకసారి మండలంలోని క్వారీ, ఇసుకరీచ్‌లను పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాస్థాయి సమావేశం ప్రతినెల మొదటి శనివారం జరపాలని మైనింగ్ ఏడీకీ సూచించారు. లైసెన్సు కలిగిన వాళ్లు మాత్రమే పేలుడు పదార్థాలను జనావాసాలకు దూరంగా ఉంచి, జాగ్రత్త పడి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పేలుళ్లు జరిపేటప్పుడు శిక్షణ పొందిన వారి నుండే జరపాలని అందుకోసం వారి సలహాలతో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పరిచి 50మందిని గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు. ఇకమీదట వారి సలహాలతో క్వారీ యాజమానులు బ్లాస్టింగ్ జరపాల్సి ఉంటుందని సూచించారు. ఇసుక విషయంలో స్థానికంగా దొరికే ఇసుకను స్థానిక అవసరాలకే ఉపయోగించుకోవాలని, దీనిని గ్రామస్థాయిలో కమిటీలు పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. మన జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నగరి ప్రాంతంలో తమిళనాడు బార్డర్‌లో జరుగుతున్నదని వార్తలు వస్తున్నాయని, దీన్ని నిరోధించేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. 2014 సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు పోలీసు అధికారులే కేసులు నమోదు చేయవచ్చుని, రుజువైతే రెండేళ్ల శిక్ష ఉంటుందని తెలిపారు. మండలస్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షణ సాగించాలని, ఇసుకకు ప్రత్యామ్నాయంగా రోబో ఇసుకకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ స్వామి, డిఎఫ్‌ఓ జగన్నాథం, తిరుపతి ఆర్డీవో నరసింహులు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.